ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కరోనా బారిన పడ్డాడు. రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక చేరిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా మొయిన్ ఆలీకి పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి ప్రయాణం చేసిన ఇంగ్లాండ్ జట్టు మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లింది. ముఖ్యంగా మొయిన్ ఆలీ పక్కనే కూర్చున్న పేసర్ క్రిస్ వోక్స్‌ని ఐసోలేషన్‌కి తరలించారు అధికారులు.