బాబర్‌ ఆజమ్‌కి ఐసీసీ వన్డే క్రికెటర్ అవార్డు... విరాట్ తర్వాత వరుసగా రెండోసారి...

First Published Jan 26, 2023, 12:31 PM IST

2022 ఏడాదికి సంబంధించిన అవార్డులను ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది ఐసీసీ. సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ పర్ఫామెన్స్‌తో  2022 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు పొందగా... పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది...

Babar Azam

గత ఏడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేశాడు బాబర్ ఆజమ్. ఇందులో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2021లోనూ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్ ఆజమ్‌కి ఇది వరుసగా రెండో అవార్డు.

Babar Azam

ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు బాబర్ ఆజమ్. జూలై 2021న విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి, ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. అప్పటి నుంచి ఆ ర్యాంకులో కొనసాగుతున్నాడు...

Babar Azam

వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకున్న బాబర్ ఆజమ్.. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండేళ్లు ఈ అవార్డు పొందిన ప్లేయర్‌గా నిలిచాడు..

Image Credit: Getty Images

2022 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో కూడా ఉన్నాడు బాబర్ ఆజమ్. ఈ లిస్టులో బాబర్ ఆజమ్‌తో పాటు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా ఉన్నారు...

Richard Illingworth

ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్, ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. 2019లో ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా నిలిచిన రిచర్డ్‌కి ఇది రెండో అవార్డు...

సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్, ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు గెలిచాడు. గత ఏడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్, వన్డేల్లో రెండు, టీ20ల్లో ఓ వికెట్ సాధించాడు. అంతేకాకుండా బ్యాటుతో 234 పరుగులు కూడా చేశాడు...

click me!