రజత్ పటిదార్‌ని ఏ ప్లేస్‌లో ఆడించాలి? ఎలా ఆడించాలి... రోహిత్ శర్మ కౌంటర్...

First Published Jan 26, 2023, 12:06 PM IST

ముంబై ఇండియన్స్‌లోకి ఎవరైనా కొత్త ప్లేయర్ వెళితే, తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. క్రిస్ లీన్, జేమ్స్ నీశమ్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టేంత స్ట్రాంగ్ లైనప్ ఉండేది ముంబై ఇండియన్స్‌కి.. ఇప్పుడు టీమిండియా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన తర్వాత నామమాత్రంగా మారిన మూడో మ్యాచ్‌లో కొత్త కుర్రాళ్లకు అవకాశాలు దక్కేవి. అయితే రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది కూడా జరగడం లేదు...

రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, రవి భిష్ణోయ్ వంటి ప్లేయర్లు రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అతని ప్లేస్‌లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన రజత్ పటిదార్, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

Image credit: PTI

ఇండోర్‌కి చెందిన రజత్ పటిదార్‌కి మూడో వన్డేలో చోటు దక్కుతుందని భావించారంతా. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు, సీనియర్ బ్యాటర్లకు రెస్ట్ ఇచ్చి రజత్ పటిదార్‌ని ఆడిస్తుందేమోనని అనుకున్నారు. అయితే అలా జరగలేదు...

Image credit: Getty

‘కొత్త ప్లేయర్‌ని ఆడించడానికి అవకాశం ఉంటే తప్పకుండా ఆడిస్తాం. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో వస్తున్నాడు. అతను డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా మూడు మ్యాచుల్లో ఆడలేకపోయాడు...
 

సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నాడు. అతను ఏం చేయగలడో, ఎలా ఆడగలడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా.. ఆరో స్థానం అతనిదే. ఇక రజత్ పటిదార్‌ని ఆడించేందుకు ప్లేస్ ఎక్కడుంది?
 

Image credit: PTI

ప్రతీ ఒక్కరినీ ఆడించాలని మేం కూడా అనుకుంటున్నాం. అయితే సమయం, సందర్భం రెండూ కలిసి రావాలి. ఇండోర్‌లో రజత్ పటిదార్‌ని ఆడించాలని అంటున్నారు... అలా చూస్తే అంతకుముందు రాంఛీలో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ని ఆడించనేలేదు.. 

Image credit: PTI

ఎవరి ఏరియాలో వారిని ఆడించాలనేది ఉండదు. మా కంటూ ఓ ప్లానింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా టీమ్‌ని ఏర్పాటు చేస్తాం.. చాలామంది ప్లేయర్లు, టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నాం. అందరినీ ఆడించలేం కదా... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

click me!