కెఎల్ రాహుల్‌కి రూ.2 కోట్ల కారు కానుకగా ఇచ్చిన విరాట్ కోహ్లీ... ధోనీ ఏం ఇచ్చాడంటే...

Published : Jan 26, 2023, 11:19 AM ISTUpdated : Jan 26, 2023, 11:32 AM IST

టీమిండియా యంగ్ క్రికెటర్ కెఎల్ రాహుల్, తన ప్రేయసి అథియా శెట్టిని సోమవారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఈ వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి 100 మంది గెస్టులు మాత్రమే హాజరయ్యారు...

PREV
15
కెఎల్ రాహుల్‌కి రూ.2 కోట్ల కారు కానుకగా ఇచ్చిన విరాట్ కోహ్లీ... ధోనీ ఏం ఇచ్చాడంటే...
Athiya Shetty And KL Rahul wedding


కెఎల్ రాహుల్‌ పెళ్లికి మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలకు కూడా ఆహ్వానం అందింది. అయితే విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉండడం వల్ల ఈ పెళ్లికి హాజరు కాలేకపోయాడు..

25
Athiya Shetty And KL Rahul wedding

అయితే కొత్త పెళ్లికొడుక్కి కానుకగా రూ.2.17 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని విరాట్ కోహ్లీ పంపినట్టు వార్తలు వస్తున్నాయి. తన తోటి క్రికెటర్లకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం విరాట్‌కి అలవాటు...

35

శుబ్‌మన్ గిల్, ఏబీ డివిల్లియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి క్రికెటర్లకు ఖరీదైన వాచీలను బహుమతిగా ఇచ్చాడు విరాట్ కోహ్లీ. కెఎల్ రాహుల్‌ పెళ్లికి ఏకంగా రూ.2.17 కోట్లతో బీఎండబ్ల్యూ కారు కొనిచ్చాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

45

అలాగే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కెఎల్ రాహుల్ పెళ్లికి రూ.80 లక్షల ఖరీదైన కవాసకీ నింజా బైక్ ఇచ్చినట్టు సమాచారం. ఈ బైక్‌ని టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి కొన్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి...

55

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన కెఎల్ రాహుల్, గత ఏడాది కెప్టెన్‌గా మారి మూడు టెస్టులకు, ఆరు వన్డేలకు, మూడు టీ20లకు కెప్టెన్సీ చేశాడు... టెస్టుల్లో ఇంకా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు...

Read more Photos on
click me!

Recommended Stories