బాబర్ ఆజమ్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోయింది! విరాట్ అలా ఆడుతుంటే... - రికీ పాంటింగ్

Published : Jan 28, 2023, 01:13 PM IST

చిన్న జట్లపైనే బాగా ఆడతాడని ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, వాటిని తలదన్నుతూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు బాబర్ ఆజమ్...

PREV
15
బాబర్ ఆజమ్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోయింది! విరాట్ అలా ఆడుతుంటే... - రికీ పాంటింగ్
Babar Azam

బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఫైనల్ చేరింది. అయితే రెండు టోర్నీల్లోనూ పాకిస్తాన్ టీమ్ టైటిల్ గెలవలేక  రన్నరప్‌గా నిలిచింది...

25

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది టీమిండియా. అప్పటిదాకా టీ20లకు పనికి రాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, 53 బంతుల్లో 82 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు...

35

‘టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ ఆజమ్‌లో ఫస్ట్రేషన్ చూశాను. ముఖ్యంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే బాబర్ ఆజమ్ చాలా కంగారు పడ్డాడు. షాదబ్ ఖాన్ వంటి సీనియర్లు వచ్చి, బాబర్ ఆజమ్‌ని కంగారు పడవద్దని చెప్పడం నేను చూశాను...

45

టీ20ల్లో కెప్టెన్సీ చేయడం తేలికైన విషయం కాదు. ముఖ్యంగా ఉత్కంఠకర పరిస్థితుల్లో కూల్‌గా ఉండడం చాలా ముఖ్యం. బాబర్ ఆజమ్‌కి ఇంకా అనుభవం అవసరం. బ్యాటింగ్‌లో చూపిస్తున్న పరిణితి, కెప్టెన్సీలో చూపించలేకపోతున్నాడు...
 

55
babar

బాబర్ ఆజమ్ మూడు ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడు. నాలుగేళ్లుగా బాబర్ ఆడుతున్న విధానాన్ని గమనిస్తూ వస్తున్నా. అతను ఇంకాస్త ఫోకస్ పెడితే గ్రేటెస్ట్ పాక్ బ్యాటర్లలో ఒకడిగా మారతాడు.. ’ అంటూ ఐసీసీ రివ్యూ మీటింగ్‌లో చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. 

Read more Photos on
click me!

Recommended Stories