ఉమ్రాన్ మాలిక్‌, శివమ్ మావిలను సరిగ్గా వాడుకోని హార్ధిక్ పాండ్యా.. హుడాతో మరో 2 ఓవర్లు వేయించి ఉంటే..

First Published Jan 28, 2023, 12:41 PM IST

ఒక్కో మ్యాచ్ గెలుస్తూ టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా ప్రశంసలు దక్కించుకున్నాడు హార్ధిక్ పాండ్యా. ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన హార్ధిక్‌కి అనధికారంగా టీ20 కెప్టెన్సీ పగ్గాలు కూడా ఇచ్చేసింది బీసీసీఐ. అయితే 10 మ్యాచుల ద్వారా సంపాదించుకున్న పేరును ఒక్క మ్యాచ్‌తో పోగొట్టుకున్నాడు హార్ధిక్ పాండ్యా...

Image credit: PTI

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యఛేదనలో 21 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. బౌలర్లు అందుబాటులో ఉన్నా, వారిని హార్దిక్ పాండ్యా వాడిన విధానం సరిగా లేదని విమర్శల వర్షం కురుస్తోంది...

18వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌తో ఆఖరి ఓవర్ వేయిస్తే.. చివరి ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు సమర్పించాడు. తన స్టైల్‌లో నో బాల్‌తో ఆఖరి ఓవర్‌ని ప్రారంభించి, 3 సిక్సర్లు, ఓ ఫోర్‌తో కలిపి 27 పరుగులు ఇచ్చేశాడు. టీమిండియా ఓటమికి ఈ ఓవరే కారణం...
 

స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌తో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించాడు హార్ధిక్ పాండ్యా. ఆ ఓవర్‌లో మాలిక్ 16 పరుగులు ఇవ్వడంతో మళ్లీ అతనికి బాల్ ఇవ్వలేదు. తొలి ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చినా, రెండో ఓవర్ నుంచి వికెట్లు తీయడం, కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం ఉమ్రాన్ మాలిక్ స్పెషాలిటీ. ఐపీఎల్‌లోనూ, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ ఇలాగే జరిగింది...

ఉమ్రాన్ మాలిక్ ఒక్క ఓవర్ వేయగా దీపక్ హుడా 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చాడు. స్పిన్ ఆడేందుకు కివీస్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసినా దీపక్ హుడాతో మరో 2 ఓవర్లు వేయించలేదు హార్ధిక్ పాండ్యా...

Image credit: PTI

శివమ్ మావి వేసిన 2 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇంప్రెస్ చేసిన శివమ్ మావిని, ఉమ్రాన్ మాలిక్‌ని, దీపక్ హుడాని సరిగ్గా వాడుకుని ఉంటే న్యూజిలాండ్ స్కోరును కట్టడి చేసే అవకాశం ఉండేది. అవకాశాలు ముందే ఉన్నా పాండ్యా మాత్రం వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు..

Deepak Hooda

‘దీపక్ హుడాతో మరో 2 ఓవర్లు వేయించి ఉండొచ్చు. మిగిలిన ఇద్దరు బౌలర్లు ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇస్తున్నప్పుడు దీపక్ హుడా లాంటి స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌ని సరిగ్గా వాడుకుని ఉండాల్సింది... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. 

click me!