CSK’s New Power-Hitter Ayush Mhatre Impresses in Debut with 213+ Strike Rate
who is ayush Mhatre: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లోనే ఎంట్రీ తొలి మ్యాచ్ నుంచే దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడుతున్నారు. మొన్న ప్రియాంశ్ ఆర్య, నిన్న వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు ఆయుష్ మాత్రే. అవునూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున యంగెస్ట్ ప్లేయర్ గా ఐపీఎల్ లోకి అరంగేట్రం చేశాడు ఆయుష్ మాత్రే.
అతని ఎంట్రీతో ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒక కొత్త సంచలనం దొరికిందనే చెప్పాలి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో కేవలం 17 ఏళ్ల వయసులో ఆయుష్ మాత్రే తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. తన అద్భుతమైన దుమ్మురేపే బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ ను వణించాడు. ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయుష్ మొదటి మ్యాచ్‌లోనే తనదైన ముద్ర వేయడమే కాకుండా చెన్నై తరపున ఆడిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డు కూడా సృష్టించాడు.
Ayush Mhatre Creates History as Youngest CSK Debutant in IPL
200కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఆయుష్ మాత్రే దూకుడు బ్యాటింగ్
చెన్నై కోసం మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆయుష్ మాత్రే ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే ఫోర్ కొట్టాడు. ఆ వెంటనే వరుసగా మూడు బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా ఆయుష్ 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 213.33గా ఉండటం విశేషం.
చెన్నై తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ప్లేయర్ఆయుష్ మాత్రే తన ఐపీఎల్ అరంగేట్రం 17 సంవత్సరాలు 278 రోజుల్లో చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడిగా ఉన్న అభినవ్ ముకుంద్ 18 యేళ్లు 139 రోజులు రికార్డును బద్దలు కొట్టాడు. సీఎస్కే నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన యంగెస్ట్ ప్లేయర్ గా ఆయూష్ మాత్రే నిలిచాడు.
From Trials to Triumph: Ayush Mhatre’s Stunning Entry into the IPL
CSK తరపున అతి పిన్నవయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:
• 17 సంవత్సరాలు 278 రోజులు – ఆయూష్ మాత్రే (2025, vs ముంబై ఇండియన్స్)
• 18 సంవత్సరాలు 139 రోజులు – అభినవ్ ముకుంద్ (2008)
• 19 సంవత్సరాలు 123 రోజులు – అంకిత్ రాజ్‌పుత్ (2013)
• 20 సంవత్సరాలు 79 రోజులు – నూర్ అహ్మద్ (2025)
ఆయుష్ మాత్రే ఎవరు?
ముంబైలో జన్మించిన ఆయుష్ మాత్రే ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. ఈ ఐపీఎల్ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమవడంతో ఆయుష్ కు అవకాశం దక్కింది. ఆయుష్‌ను IPL 2025 మెగా వేలంలో ఎవరూ కొనలేదు, కానీ సీఎస్కే నిర్వహించిన మిడ్-సీజన్ ట్రయల్స్‌లో అతను ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆయుష్ కు సీఎస్కే రూ.30 లక్షల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చింది.
బీసీసీఐ నిర్వహించిన అండర్-19 జోనల్ క్యాంప్‌లో తన ప్రతిభను చూపిన ఆయూష్.. దేశవాళీ క్రికెట్ లో అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. మొత్తంగా సీఎస్కే స్కౌటింగ్ నెట్‌వర్క్‌కు దొరికిపోయాడు.
From Trials to Triumph: Ayush Mhatre’s Stunning Entry into the IPL
విజయ్ హజారే ట్రోఫీలో 458 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో 471 పరుగులు చేసి మూడు సెంచరీలు సాధించాడు. ఆయుష్ ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడి అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 1000 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 150+ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడు ఆయుష్ మాత్రే. నాగాలాండ్‌పై 117 బంతుల్లో 181 పరుగులను 17 సంవత్సరాలు 291 రోజుల వయస్సులో సాధించాడు.
అలాగే, రంజీ ట్రోఫీలో అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. బరోడాపై 71 బంతుల్లో 52 పరుగులు కొట్టాడు. రంజీ ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్న మహారాష్ట్రపై అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అండర్ 19 ఆసియా కప్ 2024/25 లో భారత U19 జట్టు తరపున రెండవ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.