Ayush Mhatre: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఒకరికంటే ఒకరు గొప్పగా యంగ్ ప్లేయర్లు అరంగేట్రంలోనే అదరగొడుతున్నారు. ఇప్పటికే ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ వంటి బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ప్రపంచ క్రికెట్ లో తమదైన ముద్రను వేశారు. ఇప్పుడు జాబితాలో మరో తుఫాను బ్యాట్స్‌మన్ చేరిపోయాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల యంగ్ ప్లేయర్ కు అవకాశం ఇచ్చింది. ఇలా 20 ఏళ్లలోపు ప్లేయర్లకు సీఎస్కే ఛాన్స్ ఇవ్వడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాల్గవసారి. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో 20 ఏళ్ల షేక్ రషీద్ ఐపీఎల్ అరంగేట్రం చేయగా, ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రేను రంగంలోకి దించింది. తొలి మ్యాచ్‌లోనే తన బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు మాత్రే.