మొదటి వన్డేలో మహ్మద్ సిరాజ్ ఆఖరి ఓవర్‌లో విండీస్ బ్యాటర్లను కట్టడి చేసి 3 పరుగుల తేడాతో భారత జట్టుకి ఉత్కంఠ విజయం అందిస్తే, రెండో వన్డేలో అక్షర్ పటేల్ బ్యాటుతో విజృంభించి ఘన విజయం అందించాడు. 35 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 64 పరుగులు చేసిన అక్షర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
శార్దూల్ ఠాకూర్ 6 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్.. 47వ ఓవర్‌లో ఫోర్, 49వ ఓవర్‌లో ఓ ఫోర్ బాది 12 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
27
49వ ఓవర్ ఆఖరి బంతికి ఆవేశ్ ఖాన్ అవుట్ కావడం, టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది. అయితే రెండో బంతికి సింగిల్ తీసిన అక్షర్ పటేల్, నాలుగో బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు...
37
‘49వ ఓవర్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆవేశ్ భాయ్, తన తలను ఊపుతూ నాకు సైగలు చేశాడు... ‘చూడు.. వాళ్ల ముగ్గురు మెయిన్ బౌలర్ల బౌలింగ్ కోటా ముగిసిందని చెప్పాడు...
47
Axar Patel
అందుకే ఆ తర్వాతి ఓవర్‌లో పార్ట్ టైమ్ బౌలర్ వస్తాడని అర్థమైంది. అందుకే రిస్క్ లేకుండా ఫ్రీగా ఆడగలిగాను.. కేల్ మేయర్స్ లెంగ్త్ మిస్ అయ్యాడు. నేను దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సిక్సర్ బాదేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్...
57
Axar Patel
‘నేను 39వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు టీమిండియా విజయానికి 11 ఓవర్లలో 105 పరుగులు కావాలి. ఐపీఎల్‌లో ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఛేజింగ్ టీమ్స్ గెలిచాయని నేను దీపక్ హుడాతో చెప్పా...
67
Axar Patel and Sanju Samson
అందుకే చేయాల్సిన రన్ రేట్ పెరగకుండా జాగ్రత్త పడుతూ పరుగులు చేయాలని ఫిక్స్ అయ్యాం. అయినా ఈ ఓవర్‌లో ఇంత కావాలి, ఎంత రావాలనే లెక్కలు వేసుకోవాలి. లూజ్ బాల్ వస్తే బౌండరీ బాదడమే...
77
ఒక్కో ఓవర్‌కి ఒక్క షాట్ పడితే చాలని నిర్ణయించుకున్నాం. దీపక్ హుడా అవుటైన తర్వాత కూడా నేను దాన్నే ఫాలో అయ్యా... సక్సెస్ అయ్యా...’ అంటూ చాహాల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు అక్షర్ పటేల్...