వన్డేలు చచ్చిపోతున్నాయన్న వసీం అక్రమ్.. మీరు 500 వికెట్లు తీసింది ఆ ఫార్మాట్‌లోనే అంటున్న మాజీ సారథి..

Published : Jul 24, 2022, 08:21 PM IST

ODI Cricket:వన్డే క్రికెట్ అనేది క్షీణించే దశలో ఉందని, దానిని రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని కామంట్స్ చేసిన వసీం అక్రమ్ వ్యాఖ్యలపై తాజాగా అదే దేశానికి చెందిన మాజీ సారథి సల్మాన్ భట్ ఆసక్తికర కౌంటర్ ఇచ్చాడు.   

PREV
17
వన్డేలు చచ్చిపోతున్నాయన్న వసీం అక్రమ్.. మీరు 500 వికెట్లు తీసింది ఆ ఫార్మాట్‌లోనే అంటున్న మాజీ సారథి..

ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారితీసింది.  ఈ క్రమంలో ఇటీవలే పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ వన్డే క్రికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే క్రికెట్ అనేది క్షీణించే దశలో ఉందని, దానిని రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని ఈ దిగ్గజ పేసర్ కామంట్స్ చేశాడు. 

27

ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ భట్.. అక్రమ్ కు కౌంటరిచ్చాడు. అక్రమ్ అంటే తనకు గౌరవమని.. అతడి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని చెబుతూనే ఈ పేసర్ 500 వికెట్లు తీసింది వన్డే ఫార్మాట్ లోనే  అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించాడు. 

37

అక్రమ్ వ్యాఖ్యలపై భట్ స్పందిస్తూ.. ‘వన్డలేకు భారీ టోర్నీలు (ప్రపంచకప్ వంటివి) ఉన్నాయి తప్ప లీగ్స్ లేవు. ఎవరైనా ఆటగాడు మూడు ఫార్మాట్ లు ఆడి అలిసిపోతే వాళ్లు వన్డేల నుంచి రిటైరవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్లు వన్డేలకు బదులుగా టీ20లను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అందులో నగదు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే క్రికెటర్లు చాలామంది టెస్టులు, టీ20ల వైపునకే మొగ్గుచూపుతున్నారు. 

47

ఇక వసీం భాయ్ కామెంట్స్ గురించి చెప్పడానికి మనమెవరం. ఆయన మా లెజెండరీ ఆటగాడు. నేను ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ అక్రమ్ టెస్టుల కంటే వన్డేలలోనే అత్యధిక వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్ లో అక్రమ్.. 500కు పైగా వికెట్లు పడగొట్టాడు.  పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ గెలిచిన (1992లో) అక్రమ్ బౌలింగ్ ను ఎవరైనా మరిచిపోగలరా..? 

57

ముఖ్యంగా వరల్డ్ కప్ లో అతడు వేసిన రెండు డెలివరీలు ఎంత ఫేమసో అందరికీ తెలుసు. అటువంటి బంతులను మనం టీ20లలో ఆశించగలమా..? ఈ ఫార్మాట్ లో అంత టైమ్, ఆ స్థాయి బౌలింగ్ కు అవకాశం  లేదు.  మరీ ముఖ్యంగా  అతడు ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలిచాడు..’అని భట్ తెలిపాడు. 

67

నాలుగు రోజుల క్రితం అక్రమ్.. ‘టీ20లు వచ్చాక వన్డే ఫార్మాట్ చచ్చిపోయింది.వన్డే ఫార్మాట్ అంటే రెండు జట్లు 100 ఓవర్లు ఆడాలి. దానివల్ల ప్లేయర్లు చాలా అలిసిపోతున్నారు. అదీగాక మ్యాచ్ కు ముందు ప్రీ గేమ్ అని పోస్ట్ గేమ్ అని.. ఆట మధ్యలో లంచ్ అంటూ ఎంతలేదైనా రోజంతా గడిచిపోతుంది. కానీ టీ20 అలా కాదు.  మహా అయితే నాలుగు గంటల్లో ఖేల్ ఖతం. ఆధునిక క్రికెట్ లో టీ20, టెస్టు మాత్రమే మనగలుగుతున్నాయి.  వన్డే క్రికెట్ చచ్చిపోతున్నది..’ అని వ్యాఖ్యానించాడు. 

77

అయితే ఆసక్తికరమైన విషమేమిటంటే తన కెరీర్ లో 104 టెస్టులలో 414 వికెట్లు తీసిన అక్రమ్.. వన్డేలలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఘనత సాధించాడు. 356 వన్డేలలో అతడు 502 వికెట్లు తీశాడు. 

click me!

Recommended Stories