నేను మళ్లీ ఫామ్‌లోకి వచ్చా, కాసుకోండి... భారత బౌలర్లకు స్టీవ్ స్మిత్ హెచ్చరిక...

First Published Nov 24, 2020, 10:41 AM IST

టెస్టు క్రికెట్‌లో టాప్ బ్యాట్స్‌మెన్ ఎవరు అనే విషయంపై విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో స్మిత్ టెస్టుల్లో బెస్ట్ అని కొందరంటే, ఏ ఫార్మాట్ అయినా విరాట్ కోహ్లీయే ‘కింగ్’ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ ఐపీఎల్ 2020 సీజన్‌లో పెద్దగా రాణించలేదు. కోహ్లీ పర్వాలేదనిపించినా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం మరీ నిరాశపూరిత ప్రదర్శన ఇచ్చాడు.

టీమిండియాపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న స్టీవ్ స్మిత్... సిరీస్ ప్రారంభానికి ముందే తన మునుపటి ఫామ్ అందుకున్నానని భారత బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు...
undefined
‘దీన్ని వివరించడం చాలా కష్టం. కానీ రెండు రోజులుగా నాలో మునుపటి ఫామ్‌ చూస్తున్నా... నేను ప్రయత్నించిన ప్రతీది క్లిక్ అవ్వడం చూస్తున్నా. నన్ను నేను మళ్లీ అందుకున్నా... ఇది చాలా బాగుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.
undefined
‘ఈ సారి ఫామ్ అందుకోవడానికి చాలా టైమ్ పట్టింది. బహుశా లాక్‌డౌన్ వల్ల క్రికెట్‌కి బ్రేక్ రావడం వల్ల కావచ్చు. నాలుగు నెలలుగా నేను పెద్దగా బ్యాటింగ్ చేయలేకపోయాను... దానికి కారణం తెలీదు’ అన్నాడు స్టీవ్ స్మిత్.
undefined
‘ఐపీఎల్‌లో నేను పెద్దగా రాణించలేకపోయాను. నా వంతు పాత్రను పోషించలేకపోయాను. కేవలం కొన్ని ఇన్నింగ్స్‌లు మాత్రమే సరిగా ఆడాను. అయితే మళ్లీ ఇప్పుడు మంచి రిథమ్ అందుకున్నా... ఐపీఎల్‌లో దూరమైంది ఇప్పుడు నాకు దక్కినట్టుగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్.
undefined
రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన స్టీవ్ స్మిత్... 14 మ్యాచుల్లో కలిపి 311 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అవ్వడంతో ఐపీఎల్‌లో తొలిసారిగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ఆర్ఆర్.
undefined
అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ స్టీవ్ స్మిత్ పెద్దగా రాణించలేదు.
undefined
కేవలం 31 పరుగులు మాత్రమే చేసిన స్మిత్, భారత్‌తో టూర్‌కి ముందు ఫామ్‌లోకి వచ్చానంటూ ప్రకటించడం టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరపెట్టే విషయమే.
undefined
2017-18 యాషెస్ సిరీస్‌కి ముందు ఇలాగే ఫామ్‌లోకి వచ్చానని ప్రకటించిన స్టీవ్ స్మిత్... ఆ సిరీస్‌లో 687 పరుగులు చేశాడు. స్మిత్‌కి తోడుగా ఆసీస్ బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో యాషెస్ సిరీస్‌ను 4-0 తేడాతో గెలుచుకుంది ఆస్ట్రేలియా.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం, స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి స్టార్లు ఈసారి టీమిండియాపై ఆడబోతుండడం...
undefined
అదీగాక విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు మూడు టెస్టు ఆడాల్సి రావడం చూస్తుంటే...మనవాళ్లకి ఈసారి ఆసీస్‌ను ఓడించడం అంత ఈజీ కాబోదనే అనిపిస్తోంది.
undefined
click me!