జెర్సీ మూవీ చూసి ఏడ్చేశా, ఆ సీన్ నా ఫెవరెట్... ఆస్ట్రేలియా స్పోర్ట్స్ యాంకర్...

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఓ లేడీ స్పోర్ట్స్ యాంకర్ కూడా ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. బ్రహ్మానందం ఎమోజీలు, మీమీలతో తెలుగు జనాల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె పేరు చోలే అమాండా బెయిలీ...

భారత క్రికెటర్ వసీం జాఫర్ క్రికెట్ మీమీలతో ట్విట్టర్‌లో ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడో చోలే అమండా బెయిలీ కూడా అలాంటి ఆదరణే దక్కించుకుంది...
ఐపీఎల్ 2020, ఆ తర్వాత ఆస్ట్రేలియా, భారత్ టెస్టు మ్యాచుల సమయంలో అన్యూహ్యంగా టీమిండియాకి సపోర్ట్ చేస్తూ పోస్టులు చేసిన చోలే అమండా బెయిలీ... తన ఫెవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించింది.

మహేంద్ర సింగ్ ధోనీ, ఓ క్రికెట్ లెజెండ్ అయినా తన ఫెవరెట్ ఐపీఎల్ టీమ్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా పేర్కొంది... తాజాగా ఆమె తెలుగు మూవీ ‘జెర్సీ’ గురించి స్పందించింది...
‘చాలారోజులుగా నా ఫాలోవర్లు జెర్సీ మూవీ చూడమని చెబుతున్నారు. ఇన్నాళ్లకు నాకు ఆ మూవీ చూసేందుకు సమయం దొరికింది...’ అంటూ పోస్టు చేసిన చోలే అమండా... సినిమా చూసిన తర్వాత దానిపై రివ్యూ ఇచ్చింది...
‘నేను జెర్సీ చూశాను. అద్భుతమైన ఎమోషనల్ జర్నీ అది. సినిమా చూసే ఆడియెన్స్ కూడా సినిమాలో లీనమయ్యేలా క్రియేటర్స్ అద్భుతంగా తెరకెక్కించారు. అర్జున్ కల నెరవేరాలని మనం కూడా బలంగా కోరుకుంటాం...
నాని చాలా చక్కగా నటించాడు. మనం అతనితో కలిసి నవ్వుతాం, అతనితో కలిసి ఏడుస్తాం... నా ఫెవరెట్ సీన్ మాత్రం ఆ రైల్వే స్టేషన్‌లోదే. మన భయం ఆనందంగా మారే క్షణమది...’ అంటూ ట్వీట్ చేసింది చోలే అమండా...
డేవిడ్ వార్నర్ ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి స్టెప్పులు వేయడం వల్ల, ఆ వీడియో సాంగ్‌కి వందల మిలియన్ల వ్యూస్ వచ్చినట్టే... ఈ లేడీ జర్నలిస్టు కారణంగా నాని ‘జెర్సీ’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ, గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్...
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీని బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..

Latest Videos

click me!