విరాట్ కోహ్లీని అవమానించిన కివీస్ వెబ్‌సైట్... న్యూజిలాండ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ...

భారత సారథి విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో, అతని క్రేజ్‌ని చూసి ఈర్ష్య పడేవారి సంఖ్య కూడా అంతకంటే ఎక్కువగానే ఉంది. తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో మరోసారి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు కోహ్లీ...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత సారథి, వరల్డ్ నెం.1 బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అవుట్ చేశాడు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ కేల్ జెమ్మీసన్....
తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన విరాట్, మూడో రోజు ఉదయం సెషన్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లో అవుట్ కాగా... రిజర్వు డేన రెండో ఇన్నింగ్స్ ఉదయం సెషన్‌లోనూ అతని బౌలింగ్‌లోనే అవుటై పెవిలియన్ చేరాడు కోహ్లీ...

జెమ్మీసన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం ఇది మూడో సారి. 2019లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన కేల్ జెమ్మీసన్, తన కెరీర్‌లో తీసిన మొట్టమొదటి వికెట్ కూడా విరాట్ కోహ్లీదే.
దీంతో ‘కింగ్’ విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ చేతుల్లో ఆడించే పెంపుడు కుక్కగా మారాడనే అర్థం వచ్చేలా... ఓ రాణి, తన భర్తను కుక్కలా ఆడిస్తున్న ఫోటోకు పోస్టు చేసింది న్యూజిలాండ్‌కి చెందిన ప్రముఖ వెబ్‌సైట్ TheAccNZ కు చెందిన ఇన్‌స్టా అకౌంట్...
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ప్లేయర్లతో పోలిస్తే న్యూజిలాండ్ జట్టు చాలా సౌమ్యులుగా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియంసన్, తన కూల్ యాటిట్యూడ్‌తో ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...
అలాంటి న్యూజిలాండ్ 21 ఏళ్ల తర్వాత దక్కిన ఒకే ఒక్క విజయాన్ని చూసి ఇలా ప్రవర్తించడం... వారి మదం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఉదాహరణ చెబుతున్నారు నెటిజన్లు...
న్యూజిలాండ్ చివరిగా 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే, మరో టైటిల్ గెలవడానికి వారికి 21 ఏళ్లు పట్టిందని... ఈ గ్యాప్‌లో భారత జట్టు మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిందనే విషయాన్ని కివీస్ ప్రజలు గుర్తుంచుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో వర్షం రావడం, అప్పటికే న్యూజిలాండ్‌కి రెండు టెస్టులు ఆడిన అనుభవం ఉండడం, అక్కడి వాతావరణం... అన్నింటికీ మించి అదృష్టం కలిసి రావడం వల్ల ఫైనల్‌లో విజయం వరించిందనే విషయం మరిచిపోకూడదని కామెంట్లతో చెబుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...
రెండో రోజు బ్యాడ్‌లైట్ కారణంగా ఆటకు అంతరాయం కలగకపోయి ఉంటే, విరాట్ కోహ్లీ రేంజ్ ఏంటో తెలిసేదని... అదీకాకుండా భారత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంతరాయం కలిగించిన వాతావరణం... న్యూజిలాండ్‌కి అనుకూలంగా మారిందనే విషయాన్ని గుర్తించుకోవాలని చెబుతున్నారు.

Latest Videos

click me!