బుమ్రా మ్యాచ్ విన్నర్ కాదు, కాలేడు... జస్ప్రిత్ బుమ్రా కంటే అతనే బెటర్...

First Published Jun 26, 2021, 11:14 AM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ+ కేటగిరీ దక్కించుకున్న మూడో ప్లేయర్ జస్ప్రిత్ బుమ్రా. స్టార్ పేసర్‌గా గుర్తింపు దక్కించుకున్న బుమ్రా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్ కూడా.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జస్ప్రిత్ బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. షమీ, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్... ఎవరు తుదిజట్టులో ఉన్నా లేకున్నా, ‘మ్యాచ్ విన్నర్’ బుమ్రా మాత్రం టీమ్‌లో ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
అయితే ఫైనల్ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బౌలింగ్ చేసి ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయిన బౌలర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు బుమ్రా...
undefined
అయితే ఐసీసీ టోర్నీ కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవ్వడం బుమ్రాకి కొత్తేమీ కాదు. వాస్తవానికి భారత జట్టు ఓడిన ప్రతీ ఐసీసీ మ్యాచ్‌లోనూ బుమ్రా సక్సెస్ కాలేకపోయాడు..
undefined
2016 టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బుమ్రా, 42 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు...
undefined
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 68 పరుగులు సమర్పించాడు. ఆ మ్యాచ్‌లో బుమ్రా వేసిన నో బాల్... అప్పట్లో చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను మెయిడిన్ ఓవర్‌తో మొదలెట్టాడు బుమ్రా. ఓ వికెట్ కూడా తీయగలిగాడు. అయితే ఆ తర్వాత సీన్ మారిపోయింది...
undefined
కేన్ విలియంసన్, రాస్ టేలర్ భాగస్వామ్యం నిర్మిస్తున్నప్పుడు బుమ్రా మీద నమ్మకంతో అతనితోనే బౌలింగ్ చేయించాడు విరాట్ కోహ్లీ... అయితే ఫలితం మాత్రం దక్కలేదు.
undefined
అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ప్రత్యర్థి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు చకచకా వికెట్లు తీస్తున్న చోట... భారత స్టార్ పేసర్ బుమ్రా ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
మొత్తంగా ఫైనల్ మ్యాచ్‌లో 36 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా, 90 పరుగులు సమర్పించాడు. బౌలింగ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు.
undefined
దీంతో బుమ్రాపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు మహ్మద్ సిరాజ్‌ను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోని నాలుగు మ్యాచుల్లోనూ ఆడించాలని ఆలోచిస్తోందట బీసీసీఐ...
undefined
సిరాజ్‌తో పాటు స్వింగ్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కి కూడా అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట కోహ్లీ అండ్ కో. ఇదే జరిగే సిరాజ్ సక్సెస్ అయితే బుమ్రాకి టెస్టుల్లో చోటు మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
undefined
click me!