విరాట్, రోహిత్‌లను ఊరిస్తున్న రెండు రికార్డులు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఒకే దెబ్బకు...

Published : Feb 05, 2022, 12:46 PM ISTUpdated : Feb 05, 2022, 12:55 PM IST

గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా, విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి రికార్డుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌కి ముందు రెండు రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయి...

PREV
111
విరాట్, రోహిత్‌లను ఊరిస్తున్న రెండు రికార్డులు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఒకే దెబ్బకు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఈ ఇద్దరూ కలిసి వన్డేల్లో 4906 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

211

మరో 94 పరుగులు జోడిస్తే 5 వేల పరుగుల భాగస్వామ్యం జతచేసిన 8వ జోడీగా నిలుస్తారు రోహిత్, విరాట్... టీమిండియా తరుపున తరుపున మూడో జోడీగా నిలుస్తారు. 

311

భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కలిసి 176 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 47.55 సగటుతో 8227 పరుగులు జోడించి టాప్‌లో ఉన్నారు...

411

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలిసి 5 వేలకు పైగా జోడించిన రెండో భారత జోడిగా నిలిచారు. ఈ ఇద్దరూ 112 ఇన్నింగ్స్‌ల్లో 45.25 సగటుతో 5023 పరుగులు చేశారు...

511

వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శిఖర్ ధావన్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెస్టిండీస్ సిరీస్‌లో అతను బరిలో దిగడం లేదు. అతని స్థానంలో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్‌లను రోహిత్‌ శర్మతో ఓపెనర్‌గా ఆడించాలని చూస్తోంది టీమిండియా...

611

81 ఇన్నింగ్స్‌ల్లో 64.55 సగటుతో 4906 పరుగులు జోడించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన జోడిగా నిలుస్తారు...

711

గత రెండేళ్లల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో వెస్టిండీస్‌పై 9 సెంచరీలు ఉన్నాయి...

811

భారత మాజీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ కూడా ఆస్ట్రేలియాపై అత్యధికంగా 9 వన్డే సెంచరీలు చేశాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో విరాట్ సెంచరీ చేస్తే, పలు రికార్డులను అధిగమిస్తాడు... 

911

ఒకే ప్రత్యర్థిపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్‌ని అధిగమించి, సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు విరాట్ కోహ్లీ...

1011

వన్డేల్లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడానికి విరాట్‌ కోహ్లీకి మరో 193 పరుగులు కావాలి. 

1111

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఛేదనలో 5490 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 5388 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...

Read more Photos on
click me!

Recommended Stories