వరల్డ్ కప్ గెలిచినా సరిపోదా, ఇంకేం కావాలి... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్..

Published : Feb 26, 2022, 06:53 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0 తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు, దిద్దుబాటు చర్యల్లో భాగంగా కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పాల్ కాలింగ్‌వుడ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు...

PREV
110
వరల్డ్ కప్ గెలిచినా సరిపోదా, ఇంకేం కావాలి... ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్..

యాషెస్ సిరీస్‌ గెలిచి, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుది కూడా దాదాపు ఇదే పరిస్థితి...

210

ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, తన పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు...

310

‘ఇంగ్లాండ్ జట్టు కోచ్‌గా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇంగ్లాండ్ టీమ్‌కి కోచ్‌గా వ్యవహరించడం చాలా గొప్ప విషయం. నేను ఆ బాధ్యతను చక్కగా నిర్వహిస్తానని కూడా నమ్ముతున్నా...

410

ఇంగ్లాండ్ టీమ్‌లో చాలా మంది మంచి ప్లేయర్లు ఉన్నారు. అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి కొన్ని బేసిక్స్ నేర్పించాల్సి ఉంటుంది...

510

ముఖ్యంగా నో బాల్స్ విపరీతంగా వేస్తున్నారు. క్యాచులు డ్రాప్ చేస్తున్నారు... ఇలాంటి చిన్న చిన్న విషయాలను సరిదిద్దాల్సి ఉంటుంది...

610

టీమ్‌లో స్టార్ ప్లేయర్లు ఉన్నా, వాళ్లు సరిగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతుంటే... బేసిక్స్‌పైన ఫోకస్ పెట్టడమే సరైన పని...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్...

710

ఆసీస్ మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు షేన్ వార్న్.

810

‘యాషెస్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఓ హెడ్ కోచ్ నుంచి అంతకంటే పెద్దగా ఏం కోరుకుంటారు...

910

అలాంటి విజయాల తర్వాత కూడా జస్టిన్ లాంగన్, తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. కెప్టెన్ కానీ, మిగిలిన ప్లేయర్లు కానీ తన మాట వినడం లేదని ఏడుస్తూ వెళ్లిపోయాడు...

1010

జస్టిన్ లాంగర్ కోచ్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే అతన్ని ఇలా అవమానించడం నన్ను తీవ్రంగా బాధపెట్టింది...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...

click me!

Recommended Stories