వెంటనే ధోనీకి ఫోన్ చెయ్ లేదా రాహుల్ ద్రావిడ్‌తో మాట్లాడు... రిషబ్ పంత్‌కి మాజీ ఆసీస్ క్రికెటర్ సలహా...

First Published Jun 22, 2022, 12:40 PM IST

పాకిస్తాన్, ఆస్ట్రేలియా... ఏ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లైనా టీమిండియా గురించి మాట్లాడితేనే మార్కెట్. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌గా యూట్యూబ్‌కి ఎక్కిన షోయబ్ అక్తర్, సల్మాన్ భట్, ఇంజమామ్ వుల్ హక్, బ్రాడ్ హాగ్ వంటి క్రికెటర్లు, వ్యూస్ కోసం టీమిండియా గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అయితే తమ దేశం కంటే కూడా టీమిండియాపైనే ఎక్కువ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ఓ యూట్యూబ్ వీడియో రూపొందించాడు బ్రాడ్ మాగ్...

రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడం, కెఎల్ రాహుల్ గాయపడడంతో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు రిషబ్ పంత్. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయాలు ఎదుర్కొన్నా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో సఫారీలను చిత్తు చేశాడు పంత్...

స్వదేశంలో సౌతాఫ్రికాపై రెండు టీ20 మ్యాచులు గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా నిలిచిన రిషబ్ పంత్, వర్షం కారణంగా రద్దయిన ఆఖరి టీ20లో గెలిచి ఉంటే... సఫారీలపై స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గానూ నిలిచేవాడు..

‘రిషబ్ పంత్ కెప్టెన్సీ నాకైతే ఎంతో నచ్చింది. అయితే అతను కొన్ని విషయాలపై దృష్టి పెడితే కెప్టెన్‌గా మరింత సక్సెస్ అవుతాడు. ఒకటి త్వరితంగా నిర్ణయాలు తీసుకోవడం, మరోటి మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడం...

Image credit: PTI

కెప్టెన్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్లేయర్ వచ్చి మార్చేలా ఉండకూడదు, లేదా ఎవరో ఏదో చెప్పారని కెప్టెన్ తన నిర్ణయాన్ని మార్చుకోకూడదు. కావాలంటే కెప్టెన్సీ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే నీ గురువు ఎమ్మెస్ ధోనీ ఉండనే ఉన్నాడు...
 

Image credit: PTI

ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఎమ్మెస్ ధోనీ కాల్ చేసి అడుగు. ఇంకా క్లారిటీ కావాలంటే రాహుల్ ద్రావిడ్‌ని అడిగి తెలుసుకో. నీలో ఉన్న కెప్టెన్‌ని మాత్రం చావనివ్వకు... నీలో ఉన్న కెప్టెన్‌, నీ కెరీర్‌ని మరింత సక్సెస్ చేయగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రాడ్ హాగ్...

Image credit: PTI

అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రిషబ్ పంత్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బాగానే రాణించినా... ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు...

‘కెప్టెన్సీ... కెప్టెన్సీ... కెప్టెన్సీ... టీమిండియాలో ఇది ఎప్పుడూ ఓ సమస్యే. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఈ ఏడాది 11 మ్యాచుల్లో 11 గెలిచాడు. అయితే ఇప్పటిదాకా అతను విదేశాల్లో కెప్టెన్సీ చేయలేదు...

Image credit: PTI

కాబట్టి తనలోని కెప్టెన్‌ని నిరూపించుకోవడానికి, కెప్టెన్సీ భారం తనపై లేదని రుజువు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. విదేశాల్లో రోహిత్ శర్మ విజయాలు అందుకుంటే... ఎలాంటి ప్రెజర్‌నైనా తట్టుకోగలనని నిరూపించుకున్నట్టే...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్...
 

click me!