టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించిన బ్రాడ్ హాగ్... రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా...

First Published Jul 11, 2021, 1:17 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు తరుపున రోహిత్ శర్మతో కలిసి ఎవరు ఓపెనర్ చేస్తారనే విషయంపై ఓ క్లారిటీ రావడం లేదు. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తానని ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్, టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటించాడు...

శిఖర్ ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, అతనికి టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా అవకాశం దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు బ్రాగ్ హాగ్. శ్రీలంక టూర్‌లో ధావన్ అద్భుతంగా రాణిస్తే అతన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారని కామెంట్ చేశాడు...
undefined
రోహిత్ శర్మతో పాటు భారత సారథి విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఎంచుకున్న బ్రాడ్ హాగ్, ఈ ఇద్దరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇన్నింగ్స్ నిర్మించడంలో సమర్థులని కామెంట్ చేశాడు...
undefined
ఇంటర్నేషనల్ క్రికెట్‌ను అద్భుతంగా ఆరంభించిన సూర్యకుమార్ యాదవ్, మూడో స్థానంలో అద్భుతంగా సెట్ అవుతాడని చెప్పాడు బ్రాడ్ హాగ్...
undefined
కెఎల్ రాహుల్ నాలుగో స్థానానికి కరెక్టుగా సెట్ అవుతాడని, అతని అనుభవం మిడిల్ ఆర్డర్‌లో అవసరమైన పరుగులు చేయడానికి బాగా ఉపయోగపడుతుందని కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్...
undefined
ఐదో స్థానంలో యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రావాలని, అతను ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అతనికి చోటు దక్కాల్సిందేనంటూ వ్యాఖ్యానించాడు...
undefined
ఆరో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఏడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను ఎంపిక చేసిన బ్రాడ్ హాగ్... మరో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ లేదా యజ్రేంద్ర చాహాల్‌లకు చోటు దక్కుతుందని అంచనా వేశాడు...
undefined
‘శ్రీలంక టూర్‌లో కుల్దీప్ యాదవ్ అదరగొడొతే, టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతనికి అవకాశం దక్కొచ్చు. లేదంటే యజ్వేంద్ర చాహాల్ టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఉంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్...
undefined
పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలతో పాటు పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌కి కూడా అవకాశం ఇస్తే... డెత ఓవర్లలో పరుగులు చేయడానికి, పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి ఉపయోగపడతాడని కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్...
undefined
బ్రాడ్ హాగ్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇది : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్యజ్వేంద్ర చాహాల్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా
undefined
click me!