బౌలింగ్ చేస్తున్నావా, లేక అడుక్కుంటున్నావా... షోయబ్ అక్తర్‌ని ట్రోల్ చేసిన సెహ్వాగ్...

First Published Jul 11, 2021, 12:42 PM IST

బౌండరీతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, సిక్సర్‌తో సెంచరీ ఫినిష్ చేయడం, సిక్సర్లతో డబుల్, త్రిబుల్ సెంచరీలు అందుకోవడం వీరేంద్ర సెహ్వాగ్ స్పెషాలిటీ. అంతేకాదు తన బ్యాటింగ్ కంటే పదునైన మాటలతో బౌలర్లను సెడ్జింగ్ కూడా చేయగలడు వీరూ...

ముల్తాన్‌తో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 309 పరుగుల ఇన్నింగ్స్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫెవరెట్ ఇన్నింగ్స్‌లలో ఒకటి. ఆ మ్యాచ్‌లో జరిగిన ఓ చిన్న సంఘటనను తాజాగా బయటపెట్టాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...
undefined
ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో 375 బంతుల్లో 309 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్, భారత జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు...
undefined
ఈ ఇన్నింగ్స్‌ సమయంలో పాక్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌తో జరిగిన మాటల యుద్ధాన్ని బయటపెట్టాడు సంజయ్ మంజ్రేకర్...
undefined
‘‘సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షోయబ్ అక్తర్ బౌన్సర్లు వేస్తూనే ఉన్నాడు. అయితే వాటిని వదిలేస్తూ వచ్చిన వీరూ, మధ్యమధ్యలో బౌండరీలు బాదుతూ అతనికి చిరాకు తెప్పించాడు.
undefined
వీరూ బ్యాటింగ్‌తో విసిగిపోయిన అక్తర్... ‘నువ్వు 200లకు పైగా పరుగులు చేశావు, నేను ఇన్ని బౌన్సర్లు వేస్తున్నా... కనీసం ఒక్క పుల్ షాట్ కొట్టొచ్చుగా...’ అంటూ కామెంట్ చేశాడు...
undefined
దానికి వీరూ తన స్టైల్... ‘నువ్వు బౌలింగ్ వేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా’ అంటూ రిప్లై ఇచ్చాడు. వీరూ ఇచ్చిన రిప్లైతో అక్తర్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు...’’ అంటూ 2004లో జరిగిన సంఘటన గురించి చెప్పాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...
undefined
ఆ మ్యాచ్‌లో 375 బంతుల్లో 39 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ 309 పరుగులు చేయగా, సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అప్పట్లో చాలా పెద్ద వివాదానికి దారి తీసింది...
undefined
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 675 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా, ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసి ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ అయ్యింది...
undefined
దీంతో భారత జట్టుకి ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసిన షోయబ్ అక్తర్ 119 పరుగులిచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు...
undefined
భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయగా సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే రెండేసి వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన అనిల్ కుంబ్లే 6 వికెట్లు తీశాడు.
undefined
click me!