ఇలా ఆడితే టీ20 వరల్డ్‌కప్‌‌లో సెమీస్ కూడా చేరలేరు... ఆ స్టార్లు రావాల్సిందేనా...

First Published Jul 11, 2021, 11:51 AM IST

మిగిలిన జట్ల కంటే అత్యధికంగా ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచింది ఆస్ట్రేలియా. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచంతో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన ఆస్ట్రేలియా, టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత మిగిలిన జట్ల జోరు ముందు నిలవలేకపోతోంది...

ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి జట్లు పొట్టి వరల్డ్‌కప్‌లో విజయాలు సాధిస్తుంటే.. ఆసీస్ మాత్రం ఇప్పటిదాకా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయింది.
undefined
2010లో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది ఆస్ట్రేలియా..
undefined
ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఆస్ట్రేలియా ఆట చూస్తుంటే, ఈసారి కూడా ఆ జట్టు నుంచి ఛాంపియన్‌ ఆటతీరు ఆశించడం కష్టమేనని అనిపిస్తోంది...
undefined
మొదటి టీ20 మ్యాచ్‌లో 146 పరుగుల ఈజీ టార్గెట్‌ను ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా, రెండో టీ20లో 56 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...
undefined
రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేసింది.
undefined
హెట్మయర్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేయగా, బ్రావో 34 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 47 పరుగులు, రస్సెసల్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశారు..
undefined
197 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 42 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు...
undefined
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ప్యాట్ కమ్మిన్స్ వంటి స్టార్లను పక్కనబెట్టి విండీస్ టూర్‌కి వెళ్లింది ఆస్ట్రేలియా. దీంతో ఈ స్టార్లు లేని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది...
undefined
మరోవైపు రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌లు గెలిచిన విండీస్, విధ్వంసకర బ్యాట్స్‌మెన్, భారీ హిట్టర్లతో బరిలో దిగి, బౌలింగ్‌లోనూ అదరగొడుతూ వరుస విజయాలు అందుకుంది...
undefined
యాషెస్ టెస్టు సిరీస్‌కి ఫిట్‌గా ఉండేందుకు టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉండాలని స్టీవ్ స్మిత్ నిర్ణయం తీసుకోగా, డేవిడ్ వార్నర్, మ్యక్స్‌వెల్, కమ్మిన్స్ విండీస్ టూర్ నుంచి రెస్ట్ తీసుకున్నారు...
undefined
click me!