కేన్ విలియంసన్ ఇండియాలో పుట్టి ఉంటే, గొప్ప క్రికెటర్ అయ్యేవాడు... విరాట్ కోహ్లీ కారణంగా...

First Published May 14, 2021, 3:16 PM IST

విరాట్ కోహ్లీ... మూడు ఫార్మాట్లలో ధారాళంగా పరుగులు సాధిస్తూ ‘రన్ మెషిన్’గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. విరాట్ కోహ్లీతో జూ రూట్, కేన్ విలియంసన్, స్టీవ్ స్మిత్ వంటి క్రికెటర్లను పోలుస్తూ... ఎవరు గొప్ప అనే డిస్కర్షన్ కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే కోహ్లీ వల్ల కేన్ విలియంసన్‌కి సరైన గుర్తింపు రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్.

టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో టాప్ ర్యాంకులో దూసుకుపోయే విరాట్ కోహ్లీతో పోటీపడుతున్నారు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియంసన్. వీరికి తోడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా గ్రేట్ బ్యాట్స్‌మెన్ అంటుంటారు పాక్ క్రికెట్ అభిమానులు.
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్ మరోసారి ప్రత్యర్థులుగా పోటీపడబోతున్నారు. అండర్ 19 వరల్డ్‌కప్ నుంచి పోటీపడుతున్న ఈ ఇద్దరి మధ్య మరోసారి మంచి ఆసక్తికర పోరు సాగనుంది...
undefined
‘కేన్ విలియంసన్, భారతదేశంలో పుట్టి ఉంటే, అతను వరల్డ్‌లో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ అయ్యేవాడు. కానీ అతను ఇక్కడ పుట్టలేదు కాబట్టి గొప్ప బ్యాట్స్‌మెన్‌కి రావాల్సిన గుర్తింపు అతనికి రాలేదు.
undefined
సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్నంతమాత్రాన విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ కాలేడు. కేవలం విరాట్ కోహ్లీ వేల లైక్లు, క్లిక్స్ సాధిస్తున్నాడు, ఇలాంటి కొన్ని అంకెల గారడి చేస్తున్నాడు కాబట్టి అతన్ని గొప్ప క్రికెటర్ అంటూ పొగిడేస్తున్నారు...
undefined
కేన్ విలియంసన్ అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీతో సమానంగా బెస్ట్ బ్యాట్స్‌మెన్. అతను ఆడే విధానం, కామ్‌గా తన పని తాను చూసుకుపోయే విధానం, వినయం, విధేయత... అన్నీ కలిసి విరాట్ కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్‌ని చేశాయి.
undefined
నిజం ఏంటంటే కేన్ విలియంసన్ సైలెంట్‌గా ఉండడం వల్ల అతనికి రావాల్సిన గుర్తింపు దక్కడం లేదు.. ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్ మూడు టెస్టులు ఆడనుంది. టీమిండియా ఆరు టెస్టులు ఆడనుంది.
undefined
అయితే విరాట్ కోహ్లీ కంటే కేన్ విలియంసన్ ఎక్కువగా పరుగులు చేస్తాడని నేను కచ్ఛితంగా చెప్పగలను. ఇంగ్లాండ్‌ టూర్‌లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయిన విషయాన్ని గుర్తించుకోవాలి...
undefined
ఈ మధ్య కొందరు క్రికెట్ పండితులు విరాట్ కోహ్లీని తెగ పొగిడేస్తున్నారు, ఈ పొగడ్తలు అతనికి ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో రాణించడం విరాట్ కోహ్లీకి చాలా కష్టం...
undefined
గత పర్యటనలో విరాట్ కోహ్లీ ఇక్కడ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడో గుర్తు తెచ్చుకోవాలి... కేన్ విలియంసన్‌కి ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉంది.
undefined
కేన్ విలియంసన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లు లేకపోవడం వల్ల, అతనికి 40 మిలియన్ డాలర్ల సంపాదన లేకపోయినంత మాత్రాన విరాట్ కోహ్లీకి తక్కువ అయిపోడు... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్.
undefined
అయితే కేన్ విలియంసన్‌ గొప్ప ప్లేయర్ అని చెప్పడానికి విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని... క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ సాధించిన పరుగుల కారణంగానే అతనికి సోషల్ మీడియాలో అంతటి ఫాలోయింగ్ వచ్చిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు విరాట్ కోహ్లీ ఏకాగ్రతను దెబ్బ తీసేందుకే మైకేల్ వాగన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
undefined
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన విరాట్ సేన, ఆ జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించకుండా చేసింది. అందుకే మైకేల్ వాగన్, న్యూజిలాండ్ కెప్టెన్‌ను పొగుడుతూ కామెంట్ చేస్తున్నారని అంటున్నారు అభిమానులు.
undefined
click me!