పూజారా పరుగులు చేయలేడు, కోహ్లీ లేకపోతే కష్టమే.. ఆసీస్ మాజీ స్టార్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్...

First Published Nov 17, 2020, 11:39 AM IST

క్రికెట్ ప్రపంచాన్ని అబ్బుర పరుస్తున్న భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా అవుట్ చేయగల యార్కర్లతో అదరగొట్టే బుమ్రా, ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ దుమ్మురేపాడు. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా, సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. బుమ్రాకి తాను పెద్ద అభిమానినని అంటున్నాడు ఆసీస్ మాజీ స్టార్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్.

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు మైండ్ గేమ్ మొదలెట్టారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు... కొందరు కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను ఆకాశానికి ఎత్తుతుంటే, మరికొందరు బుమ్రాను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
undefined
బుమ్రా రిటైర్మెంట్ అయ్యే సమయానికి సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని ఆస్ట్రేలియా మాజీ పేసన్ జాసన్ గిలెస్పీ కామెంట్ చేసిన తర్వాతి రోజే... ఆసీస్ మాజీ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా బుమ్రా బౌలింగ్‌ను ప్రశంసించాడు.
undefined
‘బుమ్రాకి నేను పెద్ద ఫ్యాన్స్‌ని. అతని బౌలింగ్ చేసే విధానం నాకెంతో నచ్చుతుంది... ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు’ అంటూ కామెంట్ చేశాడు గ్లెన్ మెక్‌గ్రాత్.
undefined
2018-19 పర్యటనలో ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చిన టీమిండియా... టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో భారత క్రికెటర్లపై రివర్స్ ప్రెజర్ క్రియేట్ చేసి, వారి ప్రదర్శనను తగ్గించాలని చూస్తున్నారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు.
undefined
ఫిబ్రవరిలో క్రికెట్ ఆడిన భారత జట్టు, దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతోంది. అదీ కూడా ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టుతో, వారి దేశంలోనే తలబడతోంది.
undefined
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, ప్యాట్ కమ్మిన్స్ వంటి స్టార్లతో బరిలో దిగుతున్న ఆస్ట్రేలియా... ఈసారి భారత జట్టు పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది...
undefined
‘విరాట్ కోహ్లీ మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి వెళ్లనున్నాడు. అతను వెళ్లిపోవడం, కచ్ఛితంగా భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. క్వాలిటీ, క్లాస్ కలగలిసిన కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్ దూరమైతే, అది భారతజట్టుకి పెద్ద నష్టమే... ’అంటూ చెప్పుకొచ్చాడు మెక్‌గ్రాత్.
undefined
‘కోహ్లీ ఒక్కడే ఇద్దరు ప్లేయర్లతో సమానం. ఒక బ్యాట్స్‌మెన్‌గా, ఒక కెప్టెన్‌గా అతని పాత్ర అద్భుతం. కోహ్లీ జట్టులో ఉంటే ఒక ఎనర్జీ, అటిట్యూడ్ వస్తాయి. విరాట్ లేకపోతే టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా భారీ ఆధిక్యంతో సొంతం చేసుకోవచ్చు’ అని అభిప్రాయపడ్డాడు గ్లెన్ మెక్‌గ్రాత్.
undefined
‘ఛతేశ్వర్ పూజారా గత పర్యటనలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో అతను ఆడిన విధానం ఆకట్టుకుంది. పరుగులు రానప్పుడు కూడా ఒత్తిడికి గురి కాని బ్యాట్స్‌మెన్ అతను. ఈ కాలంలో బ్యాట్స్‌మెన్ మెయిడిన్ ఓవర్ ఇవ్వడానికి ఇష్టపడరు. కచ్ఛితంగా పరుగులు చేయాలని ఫీల్ అవుతారు...
undefined
పూజారాలో అలాంటి మైండ్ సెట్ లేకపోవడం అతనికి హెల్ప్ అయ్యింది. అయితే అతను ఐపీఎల్ ఆడలేదు. మార్చి తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ పర్యటనలో పూజారా అంతగా ఆకట్టుకోకపోవచ్చు. గత సీజన్‌లోలా పరుగులు చేయడమూ తేలిక కాదు...’ అన్నాడు మెక్‌గ్రాత్.
undefined
రోహిత్ శర్మ ఓ క్వాలిటీ బ్యాట్స్‌మెన్ అని చెప్పిన మెక్‌గ్రాత్... టెస్టు సిరీస్‌లో అతను కీలకం అవుతాడని అన్నాడు. కోహ్లీ గైర్హజరీతో రోహిత్ శర్మ ముందుకొచ్చి, తన సత్తా ఏంటో చూపించాల్సిన అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు మెక్‌గ్రాత్...
undefined
పూజారా, అజింకా రహానే, కెఎల్ రాహుల్ వంటి బ్యాట్స్‌మెన్లతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్ పటిష్టంగా ఉందని చెప్పాడు గ్లెన్ మెక్‌గ్రాత్... ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్ వంటి భీకర బౌలర్లు ఉండడం ఆసీస్ జట్టుకు కలిసి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
undefined
click me!