ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ బౌలర్... దేవ్‌దత్ పడిక్కల్ ఏమన్నాడంటే...

First Published Nov 16, 2020, 5:57 PM IST

IPL 2020 సీజన్‌లో టైటిల్ గెలవలేకపోయినా, ఓ యంగ్ బ్యాట్స్‌మెన్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆరంగ్రేటం సీజన్‌లోనే అద్భుతంగా రాణించి, బెంగళూరు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్... సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ గురించి చెప్పుకొచ్చాడు దేవ్‌దత్ పడిక్కల్...

15 మ్యాచులు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్... ఐదు హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేశాడు...ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లోనే మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దేవ్‌దత్ పడిక్కల్.
undefined
విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ వంటి స్టార్లు ఉన్న బెంగళూరు తరుపున సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్...
undefined
మొట్టమొదటి సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసి, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు దేవ్‌దత్ పడిక్కల్.
undefined
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రబాడా వంటి పేసర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న దేవ్‌దత్ పడిక్కల్‌ను ఓ స్పిన్నర్ బాగా ఇబ్బంది పెట్టాడట... అతనే సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్.
undefined
‘నాకు పేస్ బౌలింగ్ ఎటాక్ పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఎందుకంటే వివిధ టోర్నీల్లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో చాలాసార్లు ఆడాను. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్ చూసి అయోమయానికి గురయ్యాను...
undefined
అతన్ని ఎదుర్కోవడం ఓ సవాలుగా అనిపించింది. పేస్‌తో పాటు స్పిన్ కలగలిపి వెరైటీ బౌలింగ్ వేస్తాడు రషీద్ ఖాన్... అతని బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం కొత్తగా అనిపించింది.
undefined
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తుంటే, ఇలాంటి బౌలింగ్ ఎప్పుడూ చూడలేదనిపించింది. అతని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడం అంత ఈజీ కాదు... ’ అని చెప్పుకొచ్చాడు దేవ్‌దత్ పడిక్కల్.
undefined
ఎంతో మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్ కోసం ఐపీఎల్ మెగావేలం 2021లో ఫ్రాంఛైజీలు భారీగా పోటీపడే అవకాశం ఉంది..
undefined
IPL 2021మెగా వేలంలో ప్రతీ జట్టుకి ఇద్దరు విదేశీ ప్లేయర్లను మాత్రమే తమ వద్ద ఉంచుకునే అవకాశం ఉండడంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్, స్పిన్నర్రషీద్ ఖాన్, కేన్ విలియంసన్‌లలో ఎవరికీ ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
undefined
click me!