ఆర్‌సీబీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు కోహ్లీ టీమ్‌కి...

First Published Jan 21, 2023, 11:46 AM IST

అన్నీ ఉన్నా, అదృష్టం కలిసి రాక టైటిల్ గెలవలేని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్... ఇలా వరల్డ్ క్రికెట్ స్టార్లు ఉన్నా ఆర్‌సీబీకి టైటిల్ అందించలేకపోయారు...

Image credit: PTI

15 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయినా ఆర్‌సీబీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిజానికి సీజన్, సీజన్‌కీ ఆర్‌సీబీ క్రేజ్ పెరుగుతూ పోతోంది. ప్రతీ సీజన్‌లో ఒకే రిజల్ట్ రిపీట్ అవుతున్నా.. మళ్లీ కొత్త సీజన్ వచ్చేసరికి ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ నూతన ఉత్సాహంతో జట్టులో జోష్ నింపుతారు అభిమానులు...

RCB Account Hacked

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆర్‌సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కి గురైంది. రెండో వన్డేకి ముందు మహమ్మద్ సిరాజ్ గురించి రోహిత్ శర్మ చేసిన కామెంట్లను పోస్ట్ చేసిన ఆర్‌సీబీ, ఆ తర్వాత హ్యాక్‌కి గురైంది...

Image credit: PTI

ఆర్‌సీబీ ఖాతా పేరుని ‘బోర్‌డ్ అప్ యచ్‌ క్లబ్’ అని పేరు మార్చిన హ్యాకర్లు, ఓ వెబ్‌సైట్ లింకును జత చేశారు. ఆర్‌సీబీకి ట్విట్టర్‌లో 6.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. యాప్ గురించి రకరకాల ప్రమోషనల్ ట్వీట్లు, ఆర్‌సీబీ ఖాతాలో కనిపిస్తుండడంతో వారంతా అయోమయానికి గురవుతున్నారు.

ఆర్‌సీబీ అకౌంట్ నిజంగానే హ్యాకింగ్‌కి గురైందా? లేక ఆ గేమింగ్ యాప్‌తో కలిసి చేస్తున్న మార్కెటింగ్ టెక్నిక్ ఆ... అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు..
 

ఐపీఎల్ 2023 మినీ వేలంలో రీస్ తోప్లే, హిమాన్షు శర్మ, విల్ జాక్స్, మనోజ్ బండగే, రజన్ కుమార్, అవినాష్ సింగ్, సోనూ యాదవ్‌లను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

గత సీజన్‌లో రెండో క్వాలిఫైయర్ వరకూ వెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది. ఈసారి కూడా ఆర్‌సీబీపై భారీ అంచనాలే ఉన్నాయి..

click me!