Asia Cup 2022: చేతులెత్తేసిన లంక.. తేల్చేసిన దాదా.. ఆసియా కప్ వేదిక మార్పు

Published : Jul 22, 2022, 10:58 AM IST

Sri Lanka: ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తాము ఆసియా కప్ నిర్వహించలేమని తేల్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద ఈవెంట్ నిర్వహించలేమని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి స్పష్టం చేసింది.   

PREV
16
Asia Cup 2022: చేతులెత్తేసిన లంక.. తేల్చేసిన దాదా.. ఆసియా కప్ వేదిక మార్పు

ఆసియా కప్ నిర్వహణ పై నెలకొన్న అనుమానాలు తొలిగిపోయాయి.  ఈ టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తేల్చి చెప్పింది.  తమ దేశంలో నెలకొన్ని  ఆర్థిక, రాజకీయ పరిస్థితుల కారణంగా తాము ఈ  టోర్నీ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్టు  ఏసీసీకి తెలిపింది.

26

లంక తప్పుకోవడంతో ఈ టోర్నీని ఎక్కడ నిర్వహిస్తారనే ఉత్కంఠకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించాడు. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని కానీ దానిని యూఏఈలో నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. 
 

36

గురువారం ముంబైలో ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత  గంగూలీ పాత్రికేయులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా దాదా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే  జరుగుతుంది. యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. అక్కడి పరిస్థితులు కూడా టోర్నీ నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయి..’ అని తెలిపాడు. 

46

యూఏఈలో ఇప్పుడు వానలు కురిసే అవకాశం చాలా తక్కువ. ఉపఖండంలో అయితే ఇది వర్షాకాల సీజన్.  లంక కాకుంటే బంగ్లాదేశ్ గానీ, భారత్ లో గానీ ఈ సిరీస్ నిర్వహణకు చర్చ జరిగినా కానీ ఇక్కడ వర్షాకాలం కావడంతో మ్యాచులకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ యూఏఈలో అయితే  మ్యాచులకు వానల అంతరాయం ఉండదని దాదా తెలిపాడు. 
 

56

ఆసియా కప్ ను ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు టీ20 పద్ధతిలో నిర్వహించేందుకు ఏసీసీ ఇదివరకే షెడ్యూల్ ఖరారు చేసింది. కానీ లంకలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా  ఆ దేశం ఈ టోర్నీ నిర్వహణను ఉపసంహరించుకుంది. 

66

ఆరు దేశాలు పాల్గొనబోయే ఈ టోర్నీలో ఆటగాళ్లకు హోటల్ వసతులు, స్టేడియంలో సౌకర్యాల కల్పన, ఇతరత్రా  ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంక లో ఒక్క పూట తిండి దొరకడానికే నానా తంటాలు పడుతున్నారు. ఈ  నేపథ్యంలో  ఆసియా కప్ నిర్వహించి అపకీర్తి మూటగట్టుకోవడం కంటే తప్పుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి ఎస్ఎల్సీ వచ్చినట్టు తెలుస్తున్నది. 
 

click me!

Recommended Stories