అతన్ని సరిగ్గా వాడుకోండి, టీమిండియాకి బెస్ట్ కెప్టెన్ అవుతాడు... అయ్యర్‌పై కివీస్ మాజీ క్రికెటర్...

Published : Jul 21, 2022, 05:22 PM IST

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా అందరికంటే ముందు వరుసలో నిలిచిన ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని మొట్టమొదటిసారి ఫైనల్‌కి చేర్చిన ఈ ముంబై క్రికెటర్, గాయం కారణంగా ఒక్కసారిగా టీమ్‌లో ప్లేస్ కోసం మిగిలిన ప్లేయర్లతో పోటీపడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు..

PREV
18
అతన్ని సరిగ్గా వాడుకోండి, టీమిండియాకి బెస్ట్ కెప్టెన్ అవుతాడు...  అయ్యర్‌పై కివీస్ మాజీ క్రికెటర్...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు తర్వాతి సారథిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ అయ్యర్, ఇప్పుడు అసలు కెప్టెన్సీ రేసులోనే లేడు... అయితే న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్, అయ్యర్‌ని సరిగ్గా వాడుకుంటే కెప్టెన్‌గా టీమిండియాకి ఘన విజయాలు అందిస్తాడని అంటున్నాడు...
 

28

‘శ్రేయాస్ అయ్యర్‌లో లీడర్‌షిప్ క్వాలిటీలు పుష్కలంగా ఉన్నాయి. అతను నిజమైన కెప్టెన్. టీమిండియా అతన్ని సరిగ్గా వాడుకుంటే సారథిగా ఘన విజయాలు అందిస్తాడు...

38

శ్రేయాస్ అయ్యర్‌కి సరైన అవకాశాలు రావడం లేదు. అతనికి అవకాశాలు ఇచ్చి సరిగ్గా వాడుకుంటే లోపాలను సరిదిద్దుకోగలుగుతాడు. అయ్యర్ కూడా సురేష్ రైనాలాగే...
 

48
Image credit: PTI

సురేష్ రైనాకి షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉన్నట్టే శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. అతన్ని ఆ వీక్‌నెస్‌ని అధిగమిస్తే అతను చక్కని బ్యాటర్‌గా మారతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు కివీస్ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్...

58
Image credit: PTI

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్, దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ గాయం శ్రేయాస్ అయ్యర్ కెరీర్ గ్రాఫ్‌నే పూర్తిగా మార్చి పడేసింది...

68

గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రిషబ్ పంత్...ఈ కెప్టెన్సీ మార్పు కారణంగా శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని వీడి... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. 

78
Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్‌‌తో మెప్పించినా టీమ్ మేనేజ్‌మెంట్ అనవసర ప్రయోగాల కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో అనుకున్నంత సక్సెస్ కాలేదు కేకేఆర్... అంతేకాకుండా అయ్యర్ వీక్‌నెస్ తెలుసుకున్న కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లాండ్ బౌలర్లకు సిగ్నల్స్ ద్వారా షార్ట్ బాల్స్ వేయాల్సిందిగా సూచించి, త్వరగా అవుట్ అయ్యేందుకు కారణమయ్యాడు...

88

గాయం నుంచి కోలుకున్నా సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తుండడంతో తుది జట్టులో చోటు దక్కించుకోవడం శ్రేయాస్ అయ్యర్‌కి కష్టంగా మారింది.. అయ్యర్, తుది జట్టులోకి రావాలంటే ఏ ప్లేయర్ అయినా గాయపడాల్సిన పరిస్థితి...

click me!

Recommended Stories