పాకిస్తాన్ పై భారత్ గెలుపు.. గిల్, అభిషేక్ దుమ్మురేపారు

Published : Sep 22, 2025, 12:02 AM ISTUpdated : Sep 22, 2025, 12:16 AM IST

India vs Pakistan : పాకిస్తన్ ను మరోసారి టీమిండియా దంచికొట్టింది. ఆసియా కప్ 2025 లో సూపర్ 4 మ్యాచ్ లో పాక్ ను చిత్తుగా ఓడించింది భారత్. అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, దూబేలు అద్భుతమైన ఆటతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

PREV
15
ఆసియా కప్ 2025: పాకిస్తాన్ రెండో సారి ఓడించిన భారత్

ఆసియా కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ 4 లో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్ లోనే పాకిస్తాన్ ను టీమిండియా రెండో సారి ఓడించింది. భారత ప్లేయర్లను రెచ్చగొడితే ఎలా ఉంటుందో పాక్ బౌలర్లకు మనోళ్లు చూపించారు. 18.5 ఓవర్లలో 174/4 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

25
భారత్ తిరుగులేని విక్టరీ

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (21 సెప్టెంబర్ 2025) జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఆఫ్రిదీ బౌలింగ్ లో తిలక్ వర్మ బౌండరీ కొట్టి భారత్ కు విన్నింగ్ పరుగులు అందించాడు.

35
పాకిస్తాన్ బ్యాటింగ్.. ఫర్హాన్ హాఫ్ సెంచరీ నాక్

పాకిస్తాన్ తరఫున ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫఖర్ జమాన్ 9 బంతుల్లో 15, సైమ్ అయ్యూబ్ 17 బంతుల్లో 21 పరుగులు చేశారు. హుస్సేన్ తలత్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి అవుటయ్యాడు. చివరి ఓవర్లలో మహ్మద్ నవాజ్ 21 పరుగులు, ఫహీమ్ అష్రఫ్ 8 బంతుల్లో 20, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ తరఫున శివమ్ దూబే 2 వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.

45
భారత ఓపెనర్ల సునామీ

భారత్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆరంభించారు. తొలి బంతిని అభిషేక్ శర్మ సిక్సర్ బాదాడు. షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్ లో సిక్స్ కొట్టి.. ఆ తర్వాత కూడా పరుగులతో హోరెత్తించాడు. ఈ జోడీ 59 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం అందించింది. అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసి భారత విజయానికి పునాది వేశాడు. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు (8 ఫోర్లు) చేసి ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

55
మధ్యలో వికెట్లు, కానీ విజయం ఆపలేకపోయిన పాక్

ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖాతా కూడా తెరవలేక హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సాంజూ శాంసన్ 17 బంతుల్లో 13 పరుగులు చేసి రౌఫ్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, తిలక్ వర్మా 19 బంతుల్లో 30, హార్దిక్ పాండ్యా 7 బంతుల్లో 7 పరుగులతో భారత్ కు విజయాన్ని అందించారు.

టీమిండియా ఇప్పుడు సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 23న శ్రీలంకను ఎదుర్కొంటుంది. ఆసియా కప్ సూపర్-4 పోటీలలో భారత్ విజయపథంలో దూసుకెళ్తూ ఫైనల్‌కు దారి సుగమం చేసుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories