క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి అధికారికంగా ప్రకటించారు.
సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఈ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. మొత్తం 8 జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొంటున్నాయి.
DID YOU KNOW ?
8 సార్లు ఆసియా కప్ ను గెలిచిన భారత్
భారత క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటిరకు 16 ఎడిషన్లలో ఎనిమిది సార్లు టైటిల్‌ను గెలుచుకుంది.
25
ఆసియా కప్ 2025 లో ఆడబోయే జట్లు ఇవే
ఆసియా కప్ 2025 టోర్నీలో పాల్గొననున్న జట్లలో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమాన్, హాంకాంగ్ లు ఉన్నాయి.
ఈ జట్లు 2024 ACC మెన్స్ ప్రీమియర్ కప్ లో అర్హత పొందిన ఆధారంగా ఎంపికయ్యాయి. మొత్తం 20 రోజుల పాటు టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ 2025 జరగనుంది.
35
ఆతిథ్యాన్ని భారత్ ఎందుకు వదులుకుంది?
వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, భారత్ vs పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాల కారణంగా ఇది సాధ్యపడలేదు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఆతిథ్య దేశంగా భారత్ అంగీకరించకపోయిన నేపథ్యాన్ని కొనసాగిస్తూ, తటస్థ వేదిక అయిన UAE ను ఈ సారి ఎంపిక చేశారు. దుబాయ్, అబుదాబి ఈ టోర్నీకి ప్రధాన వేదికలుగా ఉంటాయి.
భారత్-పాకిస్తాన్.. ముచ్చటగా మూడు సార్లు తలపడే ఛాన్స్
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లు క్రికెట్ మాత్రమే కాకుండా, ఆసక్తికరమైన రాజకీయ, సామాజిక పరంగా కూడా ప్రభావం చూపే వేదికగా ఉంటుంది. తాజా షెడ్యూల్ ప్రకారం, రెండు జట్లు కనీసం ఒకసారి గ్రూప్ దశలో తలపడతాయి.
తర్వాత సూపర్ ఫోర్ దశకు చేరితే మరోసారి తలపడతాయి. రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తే మూడోసారి తలపడే అవకాశం ఉంది. అంటే ఫ్యాన్స్‌కు ముచ్చటగా మూడు మ్యాచుల విందు లభించే అవకాశం ఉంది.
55
T20 ప్రపంచ కప్‌కు ముందు ఆసియా కప్ జట్లకు కీలకం
ఈ ఆసియా కప్ 2025 టోర్నమెంట్, రాబోయే T20 వరల్డ్ కప్‌కు ముఖ్యమైన సన్నాహక టోర్నీగా భావిస్తున్నారు. ఈ టోర్నీలో జట్లు తమ గేమ్ ప్లానింగ్, బ్యాలెన్స్, కాంబినేషన్లను పరీక్షించుకునే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాయి.
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని విందును అందించనున్నాయి. అధికారిక షెడ్యూల్ ప్రకారం కనీసం మూడు సందర్భాల్లో ఈ జట్లు తలపడే అవకాశంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.