దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కొత్తగా ఉందని, వాతావరణం తేమగా ఉండటంతో బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు.
భారత జట్టులో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీమ్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని అనుకున్నట్టు చెప్పారు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు దుమ్మురేపే ప్రదర్శన ఇచ్చారు. దీంతో యూఏఈ 57 పరుగులకే ఆలౌట్ అయింది.