Asia Cup 2024, Team India, India
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 లో భారత మహిళ క్రికెట్ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో భారత జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం సెమీ ఫైనల్ లో భరత జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది.
India Women vs Bangladesh Women, India ,
ఈ మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. తన ఆల్ రౌండ్ షోతో బంగ్లాదేశ్ టీమ్ ను చిత్తుగా ఓడించింది. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ లో అదరగొట్టారు. ఆ తర్వాత బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు విజయాన్ని అందించారు.
Women's Asia Cup 2024, India,
బంగ్లాదేశ్ పై విజయంతో భారత జట్టు ఆసియా కప్ లో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ నిర్ణయం బంగ్లాదేశ్ కు భారీ షాకిచ్చింది. ఆట ఆరంభం నుంచే భారత బౌలర్లు సూపర్ బౌలింగ్ వరుసగా వికెట్లు తీసుకున్నారు.
తొలి ఓవర్ లోనే రేణుకా సింగ్ బంగ్లా ఓపెనింగ్ బ్యాటర్ దిలార అక్తర్ ను ఔట్ చేశారు. ఈ మ్యాచ్ మొత్తం మంచి బౌలింగ్ ప్రదర్శన చేసిన రేణుకా ఠాకూర్ సింగ్ మొత్తం మూడు వికెట్లు తీసుకున్నారు. అలాగే, భారత బౌలర్లలో రాధా యాదవ్ కూడా మరోసారి బాల్ తో మెరిశారు. కీలకమైన మూడు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ టీమ్ కు షాకిచ్చింది.
భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాటర్లలో వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 32 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు. 81 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 11 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన 55 పరుగులు, షఫాలీ వర్మ 26 పరుగులతో అజేయంగా విజయాన్ని అందించారు.