వచ్చే వారం రోజుల పాటు కొలంబోలో భారీ వర్షాలు.. అదే జరిగితే ఫైనల్ చేరే జట్లు ఏవంటే...

Published : Sep 08, 2023, 11:45 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీలో మొదటి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం అందుకుంది. లాహోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కి ఫ్లడ్‌లైట్ ఫెయిల్యూర్‌తో కాసేపు అంతరాయం కలిగినా... ఆట పూర్తిగా సాగింది. సెప్టెంబర్ 9 నుంచి కొలంబోలో సూపర్ 4 మ్యాచులు జరగబోతున్నాయి..

PREV
19
వచ్చే వారం రోజుల పాటు కొలంబోలో భారీ వర్షాలు.. అదే జరిగితే ఫైనల్ చేరే జట్లు ఏవంటే...
India Vs Pakistan Match

కొలంబోలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొలంబో నగరవీధులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరి, జనాలు ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొలంబోలో ఆసియా కప్ నిర్వహించడం చాలా క్లిష్టమైన టాస్కే..

29
India Vs Pakistan

కొలంబో నుంచి హంబన్‌తోటకి మ్యాచులను బదిలీ చేయాలని భావించినా, అది వర్కవుట్ కాలేదు. దీంతో వరుణుడిపైన భారం వేసి, ఆసియా కప్ 2023 టోర్నీలో మిగిలిన మ్యాచులను నిర్వహించబోతోంది ఆసియా క్రికెట్ కౌన్సిల్..
 

39

బంగ్లాదేశ్ - శ్రీలంక మధ్య సెప్టెంబర్ 9న జరగాల్సిన మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం 80 శాతం ఉంటే, సెప్టెంబర్ 10న ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 90 శాతం ఉంది..
 

49
India vs Pakistan

ఇండియా- శ్రీలంక మధ్య సెప్టెంబర్ 12న జరగాల్సిన మ్యాచ్‌ సమయంలో 80 శాతం, సెప్టెంబర్ 14న పాకిస్తాన్- శ్రీలంక మ్యాచ్ సమయంలో 70 శాతం, సెప్టెంబర్ 15న ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ సమయంలో 60 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది..

59

మ్యాచుల మధ్య ఒక్క రోజు గ్యాప్ దొరకడంతో రిజర్వు డే పెట్టి, మ్యాచులు సజావుగా పూర్తి చేయొచ్చు. అయితే అలా చేస్తే... ఇండియా, శ్రీలంక జట్లు వెంటవెంటనే రెండు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.. వన్డే వరల్డ్ కప్‌ 2023 ముందు ఇలాంటి రిస్క్ చేసేందుకు జట్లు సిద్ధంగా లేవు.. 

69
Bangladesh

వర్షం కారణంగా కొలంబోలో జరగాల్సిన మ్యాచులు ఫలితం తేలకుండా రద్దు అయితే, ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయం అందుకున్న పాకిస్తాన్, (2+1+1) 4 పాయింట్లతో ఫైనల్‌ చేరుకుంటుంది...
 

79

బంగ్లాదేశ్ మినహా ఇండియా, శ్రీలంక జట్లు మూడేసి పాయింట్లతో ఉంటాయి. గ్రూప్ స్టేజీలో గ్రూప్ బీలో 2 మ్యాచుల్లో విజయాలు అందుకున్న శ్రీలంక, పాకిస్తాన్‌తో పాటు ఫైనల్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. 

89

గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత జట్టు A2గా సూపర్ 4 రౌండ్‌కి వచ్చింది. ఆ మ్యాచ్ రిజల్ట్, నెట్ రన్ రేట్ టీమిండియాని దెబ్బ తీయొచ్చు. 
 

99
Rohit Sharma-Babar Azam

కాబట్టి ఇండియా ఫైనల్ చేరాలంటే కొలంబోలో జరిగే మూడు మ్యాచుల్లో కనీసం ఒక్కటైనా సజావుగా జరిగి, భారత జట్టు విజయం అందుకోవాలి. అప్పుడే భారత జట్టు ఫైనల్ చేరుతుంది. ఆసియా కప్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా - పాకిస్తాన్ ఫైనల్ ఆడలేదు. ఈసారి అది జరిగే ఛాన్స్ ఉంది.. 

click me!

Recommended Stories