ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి రిజర్వు డే... మిగిలిన మ్యాచులకు మాత్రం నో ఛాన్స్..

Chinthakindhi Ramu | Published : Sep 8, 2023 3:01 PM
Google News Follow Us

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయిన విషయం తెలిసిందే. కొలంబోలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సెప్టెంబర్ 10న జరగాల్సిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌‌లో ఫలితం తేలడం కూడా కష్టమే..

17
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి రిజర్వు డే... మిగిలిన మ్యాచులకు మాత్రం నో ఛాన్స్..

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ ఫలితం తేలేలా రిజర్వు డేని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). సెప్టెంబర్ 10న వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో నిలిచి పోతే, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సెప్టెంబర్ 11న కొనసాగుతుంది.

27

 అయితే బీసీసీఐ ఒత్తిడితో ఇండియా - పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే కేటాయించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్, మిగిలిన మ్యాచుల విషయంలో మాత్రం రిజర్వు డే ఆలోచన చేయలేదు..
 

37

సెప్టెంబర్ 9న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇదే వేదికలో సెప్టెంబర్ 10న ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ 9 మ్యాచ్‌కి అంతరాయం కలిగితే రిజర్వు డే కేటాయించడం కష్టం..

Related Articles

47

అయితే సెప్టెంబర్ 12న ఇండియా- శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ తర్వాత సెప్టెంబర్ 13న మ్యాచులేమీ లేవు. అవసరమైతే రిజర్వు డే కేటాయించవచ్చు. అయితే అలా చేస్తే టీమిండియా వరుసగా 4 రోజులు మ్యాచులు ఆడాల్సి రావచ్చు..
 

57

ఉదాహరణకి సెప్టెంబర్ 10న పాక్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత వర్షం పడితే, రిజర్వు డే సెప్టెంబర్ 11న టీమిండియా బ్యాటింగ్ చేయాలి. సెప్టెంబర్ 12న టీమిండియా బ్యాటింగ్ ముగిశాక వర్షం కురిస్తే, మళ్లీ రిజర్వు డే సెప్టెంబర్ 13న ఆడాలి.. ఇలా వరుసగా నాలుగు రోజులు ఆడడం చాలా కష్టమైన విషయం.

67

వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కేవలం ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్..

77

సెప్టెంబర్ 17న కొలంబోలో జరగాల్సిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కి కూడా రిజర్వు డే ఉండనుంది. అయితే ఇప్పటికైతే ఈ విషయాన్ని ఖరారు చేయలేదు ఆసియా క్రికెట్ కౌన్సిల్.

Recommended Photos