టీమిండియా ఒక్క మ్యాచ్ గెలిచినా తట్టుకోలేకపోతున్న పాక్ ఫ్యాన్స్... ఆఫ్ఘాన్‌‌ని కొనేశారంటూ...

Published : Sep 09, 2022, 05:58 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది భారత జట్టు. గ్రూప్ స్టేజీలో పాక్, హంగ్ కాంగ్‌లపై ఘన విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించిన టీమిండియా... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న భారత జట్టు, ఆఫ్ఘాన్‌పై గెలిచి పరువు నిలుపుకుని స్వదేశానికి వచ్చింది...

PREV
110
టీమిండియా ఒక్క మ్యాచ్ గెలిచినా తట్టుకోలేకపోతున్న పాక్ ఫ్యాన్స్... ఆఫ్ఘాన్‌‌ని కొనేశారంటూ...

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసి టీ20 ఫార్మాట్‌లో మొట్టమొదటి సెంచరీ అందుకోగా కెప్టెన్ కెఎల్ రాహుల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.

210

సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు చేసి అవుట్ అయినా రిషబ్ పంత్ 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో పవర్ ప్లేలో వికెట్ కోల్పోయిన భారత జట్టు, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 12.4 ఓవర్ల పాటు వికెట్ నష్టపోకుండా బ్యాటింగ్ చేసింది...

310

కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడి మూడేళ్లుగా అందకుండా ఊరిస్తున్న 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు...

410

భారత జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా ఆఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులకి పరిమితమైంది. పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచుల్లో పోరాడి ఓడిన ఆఫ్ఘాన్... టీమిండియా మ్యాచులో ఇలా చేతులు ఎత్తేయడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్...

510

పాకిస్తాన్‌, ఆఫ్ఘాన్‌ మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరా ఫైట్ నడిచింది. అంతేకాకుండా అసిఫ్ ఆలీ, ఆఫ్ఘాన్ బౌలర్ ఫరీద్‌ని బ్యాటుతో కొట్టడానికి వచ్చాడు. ఈ సంఘటన తర్వాత కొందరు ఆఫ్ఘాన్ అభిమానులు, పాక్ ఫ్యాన్స్‌పైకి ఛైర్లు విసిరి... స్టేడియంలో గొడవకు దిగారు..

610
afghan pak fans

ఈ సంఘటనలతో ఆఫ్ఘాన్‌పై పీకల్లోతు కోపంతో ఉన్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియాతో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కావాలనే ఓడిపోయిందని, కచ్ఛితంగా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు...

710

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ వరకూ కాపాడుకుంటూ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లు. 9 వికెట్లు తీసిన ఆఫ్ఘాన్ బౌలర్లు, మరో వికెట్ తీసి ఉంటే ఆసియా కప్ 2022 టోర్నీ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారేది...

810

ఆఫ్ఘాన్‌తో తాము చచ్చీ చెడి గెలవడం, టీమిండియా మరీ ఇంత తేలిగ్గా విజయాన్ని అందుకోవడంతో పాటు భారత బ్యాటర్లు ఇచ్చిన కొన్ని క్యాచులను ఫీల్డర్లు జారవిడచడంతో ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

910
Virat Kohli

భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్‌పై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు 2021 వరల్డ్ కప్ సమయంలోనూ ఆఫ్ఘాన్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. టీమిండియాతో  మ్యాచ్ ఫిక్స్ అవ్వడం వల్లే, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మధ్యలోనే మాజీ కెప్టెన్ ఆస్గర్ ఆఫ్ఘాన్ రిటైర్మెంట్ ప్రకటించాడని పిచ్చి రాతలు రాశారు...

1010

అయితే టీమిండియా, ఆఫ్ఘాన్‌లపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ధీటుగా సమాధానం ఇస్తున్నారు నెటిజన్లు. మ్యాచ్ ఫిక్సింగ్‌ అనే పదానికి పర్యాయ పదంగా మారిన పాక్ క్రికెట్ టీమ్‌కి, ఏ టీమ్ అయినా బాగా ఆడితే ఫిక్సింగ్ చేసినట్టు కనిపించడంలో తప్పులేదని అంటున్నారు టీమిండియా అభిమానులు. పక్కవారిపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసేముందు, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తమ చరిత్ర తెలుసుకోవాలని సూచిస్తున్నారు... 

Read more Photos on
click me!

Recommended Stories