తృటిలో ఆ రికార్డుకు దూరమైన అశ్విన్.. 11 రన్స్ చేసుంటే..!

Published : Dec 15, 2022, 04:00 PM IST

BANvsIND Test: బంగ్లాతో తొలి టెస్టులో అశ్విన్.. 113 బంతుల్లో 58 పరుగులు చేశాడు.  టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు  కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలు విఫలమైనా  పుజారా, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు అశ్విన్  కూడా రాణించాడు. 

PREV
16
తృటిలో  ఆ రికార్డుకు దూరమైన  అశ్విన్.. 11 రన్స్ చేసుంటే..!

భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  బంగ్లాదేశ్ తో  తొలి టెస్టులో  మరోసారి తన బ్యాటింగ్ స్కిల్స్  చాటి చెప్పాడు. బంగ్లాతో తొలి టెస్టులో అశ్విన్.. 113 బంతుల్లో 58 పరుగులు చేశాడు.  టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు  కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలు విఫలమైనా  పుజారా, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు అశ్విన్  కూడా రాణించాడు. 

26

అయితే ఈ మ్యాచ్ లో  అశ్విన్ మరో 11 పరుగులు చేస్తే  అరుదైన ఘనత అతడి సొంతమయ్యేది.  తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్.. 69 పరుగులు గనక చేసుంటే  టెస్టు క్రికెట్ లో  మూడు వేల పరుగులు, నాలుగు వందల వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్ అయ్యేవాడు. 

36

ఈ జాబితాలో  కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్.. 131 టెస్టులలో 5,348 పరుగులు చేసి  434 వికెట్లు తీశాడు. అశ్విన్.. 87  టెస్ట్ లలో  2,989 పరుగులు చేసి  442 వికెట్లు  సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.  ఆ తర్వాత  అనిల్ కుంబ్లే.. 132 టెస్టులలో 2,506 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.  

46

అంతర్జాతీయ క్రికెట్ లో   3 వేల పరుగులు చేసి   400, ఆ పైన వికెట్లు తీసిన వారిలో కపిల్, రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్ - 3,124 రన్స్, 431 వికెట్లు), షాన్ పొలాక్ (సౌతాఫ్రికా - 3,781 రన్స్, 421), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్ - 3,550 రన్స్, 566), షేన్ వార్న్ (ఆసీస్ - 3,154 రన్స్, 708 వికెట్లు) లు ముందున్నారు. 

56

ఇదే టెస్టులో సెకండ్ ఇన్నింగ్స్ లో గానీ రెండో టెస్టులో గానీ అశ్విన్ 11 పరుగులు చేస్తే  3 వేల పరుగులు పూర్తి చేస్తాడు. తద్వార దిగ్గజాల సరసన చేరుతాడు. రాబోయే రోజుల్లో అశ్విన్.. షేన్ వార్న్, హ్యాడ్లీ, షాన్ పొలాక్ ల రికార్డులు బ్రేక్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. 

66

ఇక బంగ్లాదేశ్ - ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు.   తొలి ఇన్నింగ్స్ లో  సిరాజ్ , కుల్దీప్ యాదవ్ ల ధాటికి  బంగ్లాదేశ్  బ్యాటింగ్ లైనప్  పేకమేడలా కూలింది.  35 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్.. 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది.  సిరాజ్ కు మూడు వికెట్లు దక్కగా  కుల్దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 
 

click me!

Recommended Stories