దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్.. సచిన్, లారా, పాంటింగ్‌లు కూడా అతడి తర్వాతే..

Published : Jun 29, 2023, 09:55 AM ISTUpdated : Jun 29, 2023, 09:57 AM IST

Ashes 2023: ఆస్ట్రేలియా   స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్ లో అదరగొడుతున్నాడు.    లార్డ్స్ టెస్టులో  స్మిత్  రికార్డులు బ్రేక్ చేశాడు. 

PREV
16
దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్.. సచిన్, లారా, పాంటింగ్‌లు కూడా అతడి తర్వాతే..

ఆధునిక క్రికెట్‌లో ది బెస్ట్ అనదగ్గ బ్యాటర్లలో ఒకడైన  స్టీవ్ స్మిత్..  వయసు పెరుగుతున్న కొద్దీ సొగసైన ఆటతో  రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా  లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో  జరుగుతున్న  రెండో టెస్టులో   స్మిత్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. 

26

తొలి ఇన్నింగ్స్ లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్.. ప్రస్తుతం  85 పరుగులతో నాటౌట్ గా ఉండి సెంచరీ దిశగా  పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలో అతడు వ్యక్తిగత స్కోరు  32 పరుగులకు చేరుకోగానే  స్మిత్ టెస్టులలో 9వేల పరుగుల మైలురాయిని  అధిగమించాడు. 

 

36

టెస్టులలో  వేగవంతంగా ఈ ఘనత సాధించినవారిలో  స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు.  9వేల పరుగులు చేయడానికి స్మిత్ కు 174 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. స్మిత్ కంటే ముందు  శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.. 172 ఇన్నింగ్స్ లలోనే  9వేల పరుగల మార్కును అందుకున్నాడు. 

46

సంగక్కర, స్మిత్ తర్వాత   టీమిండియా దిగ్గజం, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..  176 ఇన్నింగ్స్ లలో  9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.  విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా  177 ఇన్నింగ్స్ లలో  ఈ ఘనత  సాధించాడు. 

56

ఆస్ట్రేలియా లెజెంరీ కెప్టెన్ రికీ పాంటింగ్.. 177 ఇన్నింగ్స్ లలో 9వేల పరుగుల మైలురాయిని అందుకోగా  శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దెనే  178 ఇన్నింగ్స్ లలో  ఈ ఘనత సాధించాడు. 

66

మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్  9వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి  179 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.  తాజాగా స్మిత్.. సచిన్, పాంటింగ్, లారా,  ద్రావిడ్ ల రికార్డులను బ్రేక్ చేయడం గమనార్హం.  

click me!

Recommended Stories