వరల్డ్ కప్ ఆడేందుకు పాకిస్తాన్ వచ్చేనా..? బాబర్ గ్యాంగ్ భవితవ్యం కొత్త ప్రభుత్వం మీదే..!

Published : Jun 28, 2023, 11:16 AM IST

ఈ ఏడాది భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్  ఆడుతుందా..? లేదా..?  అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.   

PREV
16
వరల్డ్ కప్ ఆడేందుకు పాకిస్తాన్ వచ్చేనా..? బాబర్ గ్యాంగ్ భవితవ్యం కొత్త ప్రభుత్వం మీదే..!

నిన్నా మొన్నటిదాకా తమకు వన్డే వరల్డ్ కప్ లో వేదికలు మార్చాలని  పట్టుబట్టి బీసీసీఐ, ఐసీసీ  పట్టించుకోకపోవడంతో భంగపడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. అసలు ఆ జట్టు  వన్డే వరల్డ్ కప్ ఆడుతుందా..? లేదా..? అన్నది  ప్రశ్నార్థకంగానే ఉంది.  

26

భారత్‌లో పర్యటించాలంటే ఆ జట్టు   పాకిస్తాన్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది.   ఇరుదేశాల నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ అంగీకారం తప్పనిసరి. అయితే  పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

36

బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై   పాకిస్తాన్  ప్రభుత్వం గుర్రుగా ఉంది.  ఆసియా కప్ - 2023 లో అధికారిక ఆతిథ్య హక్కులు తమకే ఉన్నా బీసీసీఐ   చక్రం తిప్పడంతో  ఈ టోర్నీలో  పాకిస్తాన్ కు నాలుగు మ్యాచ్ లు మాత్రమే దక్కాయి.  ఇవి కూడా నేపాల్, భూటాన్ వంటి జట్లతో...   టోర్నీలో అత్యంత కీలకమైన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు ఫైనల్ (మొత్తంగా 9) మ్యాచ్  కూడా శ్రీలంకకే దక్కింది. 

46

దీనిపై   పీసీబీతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అసహనంగా ఉంది.  దీనితో పాటు  2025లో కూడా పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీకి  కూడా  బీసీసీఐ అడ్డుపుల్ల వేస్తున్నది. ఈ ట్రోఫీకి భారత్ తమ జట్టును పంపించే  అవకాశమైతే లేదని ఇదివరకే స్పష్టం చేసింది. 

56

ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ ప్రభుత్వం.. ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.  అయితే బీసీసీఐపై ఆగ్రహంగా ఉన్న పీసీబీ, పాకిస్తాన్ ప్రభుత్వాలు  వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనడంపై చివరినిమిషం దాకా ఎటువంటి నిర్ణయమూ తీసుకునేట్టు కనిపించడం లేదు. 

66

అంతేకాదు.. ప్రస్తుతం పాకిస్తాన్ లో అధికారంలో ఉన్న   షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పదవీకాలం  ఈ ఆగస్టుతో ముగయనుంది. గతేడాది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నేషనల్ అసెంబ్లీలో విశ్వాసం కోల్పోవడంతో షెహబాజ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం  అధికారం చేపట్టింది. కానీ ఈ ప్రభుత్వం ఆగస్టు తర్వాత  ఎన్నికలకు వెళ్లనుంది. ఎన్నికల్లో   గెలిచే కొత్త ప్రభుత్వం  ఏ నిర్ణయం తీసుకుంటుందనేదానిపై  బాబర్ ఆజమ్ గ్యాంగ్ వరల్డ్ కప్ లో  ఆడేది లేనిది స్పష్టత రానుంది. 

Read more Photos on
click me!

Recommended Stories