అర్ష్‌దీప్ సింగ్‌కి జ్వరం... శివమ్ మావిని పక్కనబెడతారా? హర్షల్ పటేల్‌ని తప్పిస్తారా...

Published : Jan 04, 2023, 04:28 PM IST

ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో టీమ్‌‌కి దూరం కావడంతో తక్కువ టైమ్‌లోనే టీమిండియాకి కీ బౌలర్‌గా మారిపోయాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ ఆడలేదు...

PREV
16
అర్ష్‌దీప్ సింగ్‌కి జ్వరం... శివమ్ మావిని పక్కనబెడతారా? హర్షల్ పటేల్‌ని తప్పిస్తారా...
Image credit: Getty

జ్వరంతో బాధపడుతున్న అర్ష్‌దీప్ సింగ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో శివమ్ మావి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. బ్యాటుతో రాణించిన దీపక్ హుడాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కినా శివమ్ మావి బౌలింగ్ పర్ఫామెన్స్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు...

26
Image credit: PTI

రెండో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ కోలుకుంటే టీమిండియాకి కొత్త కష్టాలు ఎదురవుతాయి. తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి శివమ్ మావిని వెంటనే తప్పిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుల్దీప్ యాదవ్‌ తొలి టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాక తప్పించి, పెద్ద తప్పు చేసింది టీమిండియా...

36
Image credit: PTI

శివమ్ మావి విషయంలో అలాంటి పొరపాటు జరిగితే కెరీర్ ఆరంభంలోనే తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది హార్ధిక్ పాండ్యా. శివమ్ మావిని ఆడించాలని అనుకుంటే అర్ష్‌దీప్ సింగ్ కోసం మరో బౌలర్‌ని పక్కనబెట్టక తప్పదు...

46

ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 27 పరుగులు ఇవ్వగా హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 41 పరుగలిచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ ఎక్కువ పరుగులు సమర్పించినా అతనికి దేశవాళీ టోర్నీల్లో అపారమైన అనుభవం ఉంది. కాబట్టి అతన్ని వెంటనే తీసి పక్కనబెట్టలేని పరిస్థితి....

56

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి షార్ట్ లిస్టు చేసిన జట్టులో ఉమ్రాన్ మాలిక్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 155+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి జస్ప్రిత్ బుమ్రా రికార్డును లేపేసిన ఉమ్రాన్ మాలిక్, తుది జట్టులో చోటు కోల్పోతే అతనికి అన్యాయం జరిగినట్టే...

66

కొత్త కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చి అదరగొడితే టీమిండియాకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త వాళ్ల కోసం పాత వాళ్లను తప్పించాలా? లేక జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకున్న సీనియర్లను కొనసాగిస్తూ జూనియర్లను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టాలా? అనేది తేల్చుకోలేకపోతోంది భారత జట్టు... 

click me!

Recommended Stories