నాయక్ సినిమా చూశారా! నన్ను సీఈవోగా పెడితే అలా మారుస్తా... షకీబ్ అల్ హసన్ కామెంట్...

Published : Jan 05, 2023, 05:45 PM IST

బంగ్లాదేశ్‌ జనాలకు బాలీవుడ్ అంటే ఎంతో అభిమానం. అల్లుఅర్జున్ ‘పుష్ఫ’ సినిమాలో హీరో మ్యానరిజాన్ని బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో క్రికెటర్లు వాడిన విధంగా మరెవ్వరూ వాడలేదు.  వికెట్ తీసినా, సెంచరీ బాదినా, ఆఖరికి రనౌట్ చేసినా ‘శ్రీవల్లి’ స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా క్రికెటర్లు...

PREV
15
నాయక్ సినిమా చూశారా! నన్ను సీఈవోగా పెడితే అలా మారుస్తా... షకీబ్ అల్ హసన్ కామెంట్...

బంగ్లాదేశ్‌లో మన సినిమాలకి ఉన్న క్రేజ్‌కి ఇది నిదర్శనం. తాజాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరో బాలీవుడ్ సినిమా గురించి ప్రస్తావించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది ఇప్పుడు వచ్చిన సినిమా కూడా కాదు, 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా...

25

అర్జున్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమా చూశారా! తమిళ్‌లో ‘ముదల్‌వన్’ పేరుతో తెరకెక్కిన సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా. దీన్నే అనిల్ కపూర్ హీరోగా ‘నాయక్’ పేరుతో రీమేక్ చేశారు. బంగ్లాదేశీ బెంగాలీ భాషలోనూ ‘మినిస్టర్’ పేరుతో తెరకెక్కిందీ సినిమా...తాజాగా నాయక్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు షకీబ్ అల్ హసన్...
 

35
Image credit: Getty

‘నన్ను బీపీఎల్ (బంగ్లా ప్రీమియర్ లీగ్)కి సీఏఓగా మారిస్తే, అన్నీ సరి చేయడానికి నెలా, రెండు నెలల సమయం పడుతుంది. నాయక్ సినిమా చూసే ఉంటారు కదా. ఏదైనా మార్చాలంటే మొదటి రోజు నుంచే దాన్ని మొదలెట్టాలి..

45
bangladesh

ప్లేయర్లను ఐపీఎల్‌లా వేలానికి తీసుకువస్తాయి. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీలను అలవర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బ్రాడ్‌కాస్ట్ సరిగా లేదు, ఆడుతున్న మైదానాలు సరిగా లేవు... బీపీఎల్ స్టాండర్డ్ గురించి నాకు ఐడియా ఉంది..

55

ప్రపంచంలో ఏ లీగ్‌తోనూ మనం పోల్చి చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. డీఆర్‌ఎస్ ప్రవేశపెట్టడానికి మనల్ని ఏది అడ్డుకుంటోంది. ఆ మాత్రం స్థోమత కూడా మనదగ్గర లేదా? ఏ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు? ఎవరు లేరనే విషయం కూడా తెలీని పరిస్థితిలో ఉన్నాం..’ అంటూ కామెంట్ చేశాడు షకీబ్ అల్ హసన్.. 

click me!

Recommended Stories