అతని కంటే అర్ష్‌దీప్ సింగ్‌ రికార్డులు భేష్... అయినా పట్టించుకోని టీమిండియా...

Published : Jul 26, 2022, 04:22 PM IST

ఐపీఎల్‌లో, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసినా అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు అర్ష్‌దీప్ సింగ్. ఐపీఎల్‌ 2022లో డెత్ ఓవర్లలో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని అర్ష్‌దీప్ సింగ్, అంతర్జాతీయ కెరీర్‌ని మెయిడిన్ ఓవర్‌తో మొదలెట్టాడు...  

PREV
16
అతని కంటే అర్ష్‌దీప్ సింగ్‌ రికార్డులు భేష్... అయినా పట్టించుకోని టీమిండియా...
Arshdeep Singh

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి మెప్పించిన అర్ష్‌దీప్ సింగ్, ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి 3.3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు..

26

లిస్టు ఏ క్రికెట్‌లో ఆవేశ్ ఖాన్ కంటే అర్ష్‌దీప్ సింగ్‌కి మెరుగైన రికార్డు ఉంది. ఆవేశ్ ఖాన్ 22 లిస్టు ఏ మ్యాచులు ఆడి 5.43 ఎకానమీతో 17 వికెట్లు తీస్తే... అర్ష్‌దీప్ సింగ్ 17 మ్యాచులు ఆడి 21 వికెట్లు తీశాడు. ఎకానమీ 4.76గా ఉంది... 

36
Image credit: PTI

ఆవేశ్ ఖాన్‌ కంటే అర్ష్‌దీప్ సింగ్‌కి లిస్టు ఏ క్రికెట్‌లో మెరుగైన రికార్డు ఉన్నా... ఈ యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌కి తుదిజట్టులో అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది..  

46

‘అర్ష్‌దీప్ సింగ్‌కి తుది జట్టులో చోటు రావాలని నేను కోరుకుంటున్నా. శార్దూల్ ఠాకూర్ కావచ్చు లేదా మహ్మద్ సిరాజ్ కావచ్చు... అర్ష్‌దీప్ సింగ్, విండీస్ పిచ్‌లపై ఆ వేడిని తట్టుకుని తన 10 ఓవర్లు ఎలా పూర్తి చేస్తాడో చూడాలనుకుంటున్నా...

56

టీ20 క్రికెట్‌లో అతను ఏం చేయగలడో చూశాం. కానీ వన్డేల్లో కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్. భారత జట్టు అతన్ని ఎందుకు సరిగ్గా వాడుకోవడం లేదో అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్...

66

‘భారత జట్టు విజయంలో దీపక్ హుడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను వేసిన 9 ఓవర్లు మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్. ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండి, బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్... టీమిండియాకి చాలా గొప్ప అడ్వాంటేజ్...’ అంటూ కామెంట్ చేశాడు పార్థివ్ పటేల్.. 

click me!

Recommended Stories