టీమిండియా తరుపున అదరగొట్టిన ఆల్‌రౌండర్లలో ఇర్పాన్ పఠాన్ ఒకడు. అటు బాల్‌తో, ఇటు బ్యాటుతో అదరగొట్టిన ఇర్ఫాన్ పఠాన్, ఓ స్టేజ్ దాటిన తర్వాత బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో టీమ్‌లో చోటు కూడా కోల్పోయాడు.
ఇర్ఫాన్ పఠాన్ జట్టుకి దూరమైన తర్వాత హార్ధిక్ పాండ్యా మాత్రమే ఆ ప్లేస్‌కి సరైన న్యాయం చేయగలిగాడు. ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు...
28
అయితే గాయాలతో సతమతమవుతున్న హార్ధిక్ పాండ్యా, సుదీర్ఘ ఫార్మాట్ ఆడక చాలా ఏళ్లే అయ్యింది. వరుసగా టీ20 మ్యాచులు ఆడుతున్న పాండ్యా, అప్పుడప్పుడూ వన్డే సిరీస్‌కి అందుబాటులో ఉంటున్నాడు...
38
‘రెండేళ్ల క్రితం దీపక్ హుడా కూడా టీమిండియాలోకి వస్తానని అనుకుని ఉండడు. ఇప్పుడు జట్టులోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు...
48
జట్టులోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలోనే దీపక్ హుడా సగం విజయం సాధించేశాడు.. అతను భారత జట్టుకి ఫ్యూచర్ ఆల్‌రౌండర్. ఇప్పుడు అతని వయసు 27 ఏళ్లు మాత్రమే...
58
Deepak Hooda
అతన్ని సరిగ్గా వాడుకంటే మరో 10 ఏళ్లు భారత జట్టుకి ఆడగలడు. ఎంతలేదన్నా మరో ఆరేడు ఏళ్లు మంచిగా రాణించగలడు.. ఇంకా అతను సాధించాల్సిందిగా చాలా ఉంది...
68
Image credit: PTI
ఫలితం ఆశించి పని చేస్తే రిజల్ట్ ఎప్పుడూ రాదని నేను అతనికి చెప్పాను. ఫలితం గురించి ఆలోచించకుండా నీ బెస్ట్ ఇవ్వాల్సిందిగా సూచించాను.. రిజల్ట్ వస్తే మంచిదే, రాకపోతే మరింత మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించమని చెప్పా...
78
Deepak Hooda and Sanju Samson
అతను ఫార్మాట్‌ని బట్టి క్రీజును వాడుకునే విధానం కూడా మారుస్తున్నాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడుతూ దూకుడు పెంచాలో హుడాకి బాగా తెలుసు... ముఖ్యంగా గ్యాప్‌లను రాబట్టి బౌండరీలు చేయడంలో హుడా దిట్ట...’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...
88
బరోడాకి చెందిన దీపక్ హుడా, కృనాల్ పాండ్యాతో గొడవ పడి 2021 ఆరంభంలో బరోడా జట్టుని వీడి రాజస్థాన్‌లో చేరాడు. ఈ సమయంలో హుడాకి అండగా నిలిచాడు ఇర్ఫాన్ పఠాన్...