ఆ ఎడిటర్ చేసిన తప్పే, నన్ను ఈ స్థాయికి చేర్చింది... టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్...

Published : Jul 26, 2022, 02:14 PM IST

టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు రాహుల్ ద్రావిడ్. ఎలాంటి పిచ్‌లో అయినా క్రీజులో పాతుకుపోవడం ‘ది వాల్’ ద్రావిడ్ స్పెషాలిటీ. ప్రస్తుతం టీమిండియాకి హెడ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న రాహుల్ ద్రావిడ్ విజయం వెనక ఓ ఎడిటర్ చేసిన తప్పు ఉందట... వినడానికి, చదవడానికి కాస్త వింతగా అనిపిస్తున్నా ఇది నిజం!...

PREV
16
ఆ ఎడిటర్ చేసిన తప్పే, నన్ను ఈ స్థాయికి చేర్చింది... టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్...

తాజాగా భారత ఒలింపిక్ విన్నింగ్ షూటర్ అభినవ్‌ బింద్రాతో కలిసి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు...

26

‘సక్సెస్ ఎంత పెద్దగా ఉండాలంటే, అది మన పేరును ప్రపంచమంతా పరిచయం చేయాలి. నేను స్కూళ్లో జరిగిన ఓ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేశా. అప్పట్లో స్కూల్ టోర్నీల్లో జరిగిన మ్యాచులను కూడా పేపర్‌లో వేసేవాళ్లు...

36
Image credit: PTI

సెంచరీ తర్వాత ఆశగా నా పేరు ఉంటుందని పేపర్ తీసుకున్న నేను, ఆ వార్త చూసి షాక్ అయ్యా. నా పేరు రాహుల్ 
 ద్రావిడ్ అయితే అందులో రాహుల్ డేవిడ్ అని రాశారు. ఆ వార్త రాసిన ఎడిటర్, నా పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చని అనుకున్నాడేమో...

46
Image credit: Getty

సాధారణంగా ద్రవిడ్ అనే పేరు ఎవ్వరికీ ఉండదు. అందుకే డేవిడ్ అయి ఉండొచ్చని డేవిడ్ అని రాసేశాడు. అపపుడే అర్థమైంది. సెంచరీ చేసినా నా పేరు కూడా ఎవ్వరికీ తెలియదని...

56
Image credit: PTI

అందుకే నా పేరు అందరికీ తెలిసేలా చేయాలని అనుకున్నా. టాప్ పొజిషన్‌కి వెళ్లాలనే పట్టుదల పెరిగింది. కొన్నేళ్ల తర్వాత అదే పత్రికలో నా పేరు మెయిన్ పేపర్‌లో హెడ్‌లైన్‌గా వచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్...

66

టెస్టులు, వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడైన రాహుల్ ద్రావిడ్, టీమిండియాకి కెప్టెన్‌గానూ విదేశాల్లో అద్భుత విజయాలు అందుకున్నాడు. అండర్ 19 కోచ్‌గా, ఎన్‌సీఏ హెడ్‌గా వ్యవహరించిన ద్రావిడ్, ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు..

click me!

Recommended Stories