Gill - Sara Tendulkar:   గిల్ - సారా త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు! వారి పెళ్లి తేదీ ఖరారైందా?

Rajesh K | Published : Nov 13, 2023 4:17 PM
Google News Follow Us

Gill - Sara Tendulkar: శుభ్‌మ‌న్ గిల్‌, సారా టెండూల్క‌ర్ పెళ్లిపై యూఏఈ క్రికెట‌ర్ చిరాగ్ సూరి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వారిద్ద‌రి రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారని క‌న్ఫామ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్రమంలో సారా శుభ్‌మన్ వివాహ తేదీపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

17
Gill - Sara Tendulkar:   గిల్ - సారా త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు!  వారి పెళ్లి తేదీ ఖరారైందా?
Gill - Sara Tendulkar

Gill - Sara Tendulkar: టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌య సారా టెండూల్క‌ర్ డేటింగ్ చేస్తోన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఈ వార్తలకు ఊతమిచ్చేలా శుభ్‌మ‌న్, సారా క‌లిసి దిగిన ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అలాగే శుభ్‌మ‌న్ ఆడిన ప్రతి మ్యాచ్‌‌లో సారా టెండూల్క‌ర్ క‌నిపించ‌డం కూడా ఈ పుకార్ల‌కు మరింత బ‌లాన్ని చేకూర్చాయి. 

27
Shubman Gill-Sara Tendulkar

 ఈ తరుణంలో వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. ఈ లవ్ బర్డ్స్ (గిల్‌-సారా ) త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు, వారి వివాహ తేదీలు కూడా ఫిక్స్ అయ్యినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

37
Shubman Gill-Sara Tendulkar

తాజాగా సారా శుభ్‌మన్ పెళ్లి తేదీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో శుబ్మాన్ గిల్ సెంచరీ చేసిన తర్వాత తనదైన శైలిలో ప్రేక్షకులను పలకరించారు. ఈ తరుణంలో సారా టెండూల్కర్ కూడా ఇదే శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. 

Related Articles

47
Shubman Gill-Sara Tendulkar

ఈ వీడియో వైరల్ కావడంతో సారా తన ప్రేమను శుభ్‌మన్‌తో వ్యక్తం చేసిందని, ప్రపంచ కప్ పోటీ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వీరి రిలేషన్ షిప్ పై పలు వార్తలు వైరల్ అవుతున్నా.. అటు గిల్ ఫ్యామిలీతో గానీ,  ఇటు స‌చిన్ ఫ్యామిలీ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

57
Shubman Gill-Sara Tendulkar

 తాజాగా గిల్‌- సారా రిలేష‌న్‌షిప్‌పై యూఏఈ క్రికెట‌ర్ చిరాగ్ సూరి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఓ ఇంట‌ర్వ్యూలో నెక్స్ట్ పెళ్లిపీట‌లు ఎక్క‌బోయే స్టార్ క్రికెట‌ర్ ఎవ‌ర‌ని అడిగిన ప్ర‌శ్న‌కు శుభ్‌మ‌న్ పేరును చెప్పాడు చిరాగ్ అలీ. శుభ్‌మ‌న్‌కు ల‌వ‌ర్ ఉంద‌ని, ఆమె పేరు సారా అని చిరాగ్ అలీ చెప్పాడు. ఆమె మ‌రెవ‌రో కాదు స‌చిన్ డాట‌ర్ అని చెప్పాడు. 

67
Shubman Gill-Sara Tendulkar

 సారానే శుభ్‌మ‌న్ పెళ్లిచేసుకునే అవ‌కాశం ఉంద‌ని చిరాగ్ సూరి అన్నాడు. శుభ్‌మ‌న్‌ - సారా పెళ్లిపై చిరాగ్ సూరి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. చిరాగ్ సూరి ఇంట‌ర్వ్యూ క్లిప్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. చిరాగ్ సూరి కామెంట్స్ నిజ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని నెటిజ‌న్లు కూడా కామెంట్స్  చేస్తున్నారు. 

77
Shubman Gill-Sara Tendulkar

 ఇటీవ‌లే శుభ్‌మ‌న్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌డంతో ల‌వ్ సింబ‌ల్‌తో అత‌డికి కంగ్రాట్స్ చెప్పింది సారా టెండూల్క‌ర్‌. త‌మ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్‌ను చెప్ప‌క‌నే చెప్పిందంటూ ఆమె పోస్ట్‌కు కామెంట్స్ చెప్పుతున్నారు.

Read more Photos on
Recommended Photos