పాండ్యా-నటాషాలకు శుభాకాంక్షల వెల్లువ.. స్పందించిన కోహ్లీ వైఫ్

Published : Feb 17, 2023, 04:45 PM IST

టీ20లలో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా ఉన్న హార్ధిక్ పాండ్యా  రెండ్రోజుల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా స్టాన్కోవిచ్ తో కలిసి  హార్ధిక్  రెండు మతాల సంప్రదాయాలలో  పెళ్లి చేసుకున్నాడు. 

PREV
17
పాండ్యా-నటాషాలకు శుభాకాంక్షల వెల్లువ.. స్పందించిన కోహ్లీ వైఫ్
Hardik Pandya

టీమిండియా స్టార్  ఆల్ రౌండర్, ప్రస్తుతం టీ20లకు తాత్కాలిక సారథిగా  ఉన్న   హార్ధిక్ పాండ్యా ఇటీవలే  నటాషా  స్టాన్కోవిచ్ ను రెండోసారి వివాహమాడిన విషయం తెలిసిందే.   రెండేండ్ల క్రితమే వీరి వివాహం జరిగినా ఫిబ్రవరి 14 సందర్భంగా ఈ జంట మళ్లీ  వివాహ వేడుకను జరుపుకుంది. 

27

హార్ధిక్-నటాషాలు   2020లోనే పెళ్లి చేసుకున్నారు.  జనవరి 1న వీరి ఎంగేజ్మెంట్ జరుగగా  మే 31న   అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.  అయితే ఈ  ప్రేమజంట  వాలైంటెన్స్ డే రోజున  మళ్లీ పెళ్లి చేసుకుంది. తొలుత రాజస్తాన్ లోని ఉదయ్‌పూర్ కోటలో  నటాషా  మత సంప్రదాయాల ప్రకారం ‘వైట్ థీమ్ వెడ్డింగ్’ జరిగింది.  

37

హార్ధిక్ - నటాషాలు తమ కుమారుడు  అగస్త్యతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు కలిసి ఈ  వేడుకలో  పాల్గొన్నారు. ఈ  పెళ్లిలో నటాషా.. క్రిస్టియన్  విశ్వాసాల ప్రకారం వైట్ కలర్  గౌన్ ధరించింది.  పాండ్యా   సూట్ బూట్ లో అదరగొట్టాడు.  ఈ పద్ధతిలో  పాండ్యా-నటాషాలు ఉంగరాలు మార్చుకున్నారు. 
 

47

తర్వాత ఈ ఇద్దరూ హిందూ  సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.  ఈ పద్ధతిలో పాండ్యా.. భార్య నుదుటిన సిందూరం దిద్ది  మురిసిపోయాడు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు  నెట్టింట వైరల్ గా మారాయి.     

57

కాగా ముచ్చటగా మూడు సార్లు (2020లో తొలిసారి,   ఉదయ్‌పూర్ లో రెండు మతాల  సంప్రదాయాలకు అనుసరించి రెండు సార్లు)  పెళ్లి చేసుకున్న ఈ జంటకు  సహచర క్రికెటర్లతో  పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు  శుభాకాంక్షలు చెబుతున్నారు.   టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ .. పాండ్యా - నటాషాలకు శుభాకాంక్షలు తెలిపింది.    

67

అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో  ఈ జంట పెళ్లి చేసుకున్న  ఫోటోను షేర్ చేస్తూ  ‘కంగ్రాట్యులేషన్స్. ఈ ప్రేమ  సంతోషాలు మీకు జీవితాంతం   కొనసాగాలని ఆశిస్తున్నాను..’అని   రాసుకొచ్చింది.  

77

కాగా  ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో  జరిగిన టీ20 సిరీస్ లలో  భారత్ ను గెలిపించిన  హార్ధిక్ పాండ్యా..   ప్రస్తుతం  లీవ్స్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.  ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తర్వాత  జరుగబోయే  వన్డే సిరీస్  తో తిరిగి భారత జట్టులోకి వస్తాడు.   ఆ తర్వాత ఐపీఎల్  లో ఆడనున్నాడు. ఐపీఎల్ లో పాండ్యా గుజరాత్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories