అక్షర్ పటేల్‌కి ఏమైంది? ఇండియాలో మోస్ట్ డేంజరస్ బౌలర్‌ని ఎలా వాడాలో రోహిత్‌కి తెలీడం లేదా...

Published : Feb 17, 2023, 04:26 PM IST

అక్షర్ పటేల్... 2021లో స్వదేశంలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రటేం చేసిన బౌలర్. తొలి సిరీస్‌లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అక్షర్ పటేల్... అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తీసింది ఒకే ఒక్క వికెట్.. 

PREV
17
అక్షర్ పటేల్‌కి ఏమైంది? ఇండియాలో మోస్ట్ డేంజరస్ బౌలర్‌ని ఎలా వాడాలో రోహిత్‌కి తెలీడం లేదా...

2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ 4 టెస్టుల్లో 32 వికెట్లు తీస్తే, 3 టెస్టులు ఆడిన అక్షర్ పటేల్, 27 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 3 టెస్టుల్లో 4 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అక్షర్ పటేల్, అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీశాడు...

27

ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు ఆడిన అక్షర్ పటేల్, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడాడు. స్వదేశంలో ఆడిన ప్రతీ టెస్టు మ్యాచ్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే నాగ్‌పూర్ టెస్టుతో ఈ రికార్డు తెరమరుగైంది. ఒకే ఒక్క వికెట్‌తో బౌలింగ్‌లో నిరాశపరిచాడు అక్షర్... 

37

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అక్షర్ పటేల్. రెండో ఇన్నింగ్స్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టగలిగాడు. స్వదేశంలో మోస్ట్ డేంజరస్‌ బౌలర్‌గా మారిన అక్షర్ పటేల్‌ని రోహిత్ సరిగా వాడడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి...

47

బౌలర్లను ఎలా వాడాలో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి తెలిసినట్టు, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు తెలియదని.. అందుకే అక్షర్ పటేల్ నుంచి రాబట్టాల్సిన పర్ఫామెన్స్‌ని తీసుకురాలేకపోతున్నాడని అంటున్నారు కొందరు విరాట్ వీరాభిమానులు... 

57
Axar Patel

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లను ఎదుర్కోవడం కోసం సెపరేట్‌గా హోమ్‌వర్క్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు... అక్షర్ పటేల్ బౌలింగ్ వీడియోలను చూసి, అతన్ని ఫేస్ చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందింది... ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కూడా స్వయంగా ప్రకటించింది.

67

అక్షర్ పటేల్ కొన్నాళ్లుగా బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టడం వల్లే బౌలింగ్‌లో వికెట్లు తీయడం లేదని మరికొందరు అంటున్నారు. 2021 ఇంగ్లాండ్ టూర్‌లో మొదటి రెండు టెస్టుల్లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీయలేకపోయినా బ్యాటింగ్‌లో అవసరమవుతాడని అతన్ని కొనసాగించాడు విరాట్ కోహ్లీ...

77

అక్షర్ పటేల్ విషయంలో అలాంటి ఆలోచన చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్వదేశంలో బ్యాటుతో రాణించగలరు. తొలి టెస్టులో రాణించారు కూడా. కాబట్టి టీమ్‌లో స్థిరమైన ప్లేస్ కావాలంటే అక్షర్ పటేల్ కేవలం బ్యాట్‌తో పరుగులు చేస్తే సరిపోదు, బంతితోనూ తన మ్యాజిక్ చూపించగలిగాలి...

Read more Photos on
click me!

Recommended Stories