సారీ.. అన్ని ఫార్మాట్లలో ఇండియా నెంబర్ వన్ కాదు.. ఆ తప్పు వల్లే ఇదంతా.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

Published : Feb 17, 2023, 03:04 PM IST

ICC Rankings: రెండ్రోజుల క్రితం  టెస్టులలో నెంబర్ వన్ ర్యాంకు దక్కడంతో  భారత్.. మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమ్ గా  రికార్డు సృష్టించింది. కానీ గురువారం   భారత్ మళ్లీ రెండో స్థానానికే పరిమితమైంది.   

PREV
16
సారీ.. అన్ని ఫార్మాట్లలో ఇండియా నెంబర్ వన్ కాదు.. ఆ తప్పు వల్లే ఇదంతా.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

రెండ్రోజుల క్రితం   అంరత్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  టెస్టు ర్యాంకింగ్స్  లో భారత్ కు  నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. నెంబర్ వన్ ర్యాంకు దక్కడంతో  భారత్.. మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమ్ గా  రికార్డు సృష్టించింది. కానీ గురువారం   భారత్ మళ్లీ రెండో స్థానానికే పరిమితమైంది. 

26

అయితే  ఐసీసీ  దీనిపై  తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో అదీ అటు ఆస్ట్రేలియా గానీ ఇటు ఇండియా గానీ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండా   ర్యాంకులు మారడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఐసీసీ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది.

36

సాంకేతిక లోపం వల్ల  భారత్ నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్నదని.. ఆస్ట్రేలియానే టెస్టులలో నెంబర్ వన్ టీమ్ అని క్లారిటీ ఇచ్చింది. ఇందుకు గాను క్షమాపణలు  కూడా చెప్పింది.   తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఐసీసీ.. ‘ఫిబ్రవరి 15న కొద్దిసేపు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్ అని  చూపించింది.  కానీ   టెక్నికల్ ఎర్రర్ వల్ల అలా జరిగింది. ఇలా జరిగినందుకు మేం క్షమాపణలు చెబుతున్నాం..’అని తెలిపింది. 

46

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత  భారత్  పాయింట్ల పట్టికలో  నెంబర్ వన్ పొజిషిన్ కు వచ్చినట్టు ర్యాంక్స్ లో  కనిపించింది.  ఫిబ్రవరి 15న ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం.. భారత జట్టు  నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. భారత్.. 115 పాయింట్లతో  అగ్రస్థానం  సాధించింది.  ఆస్ట్రేలియా.. 111 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.   ఈ  జాబితాలో ఇంగ్లాండ్  (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85), వెస్టిండీస్ (79) పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.   77 పాయింట్లతో  పాకిస్తాన్.. ఏడో స్థానంలో నిలిచింది. 

56

కానీ పునరుద్ధరించిన  లిస్ట్ ప్రకారం..  126  పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా  ఇండియా  115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ (107), సౌతాఫ్రికా (102), న్యూజిలాండ్ (99), పాకిస్తాన్ (30) లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

66

టెస్టులలో  నెంబర్ వన్ స్థానంలో లేకున్నా భారత్ వన్డే, టీ20లలో మాత్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.   టీ20లలో భారత జట్టు.. 267 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా..  ఇంగ్లాండ్ (266), పాకిస్తాన్ (258),  సౌతాఫ్రికా  (256), న్యూజిలాండ్ (252), ఆస్ట్రేలియా (251)   లు   తదుపరి స్థానాల్లో ఉన్నాయి. వన్డేలలో  50 ఓవర్ల ఫార్మాట్ లో  భారత్..  114 పాయింట్లతో   తొలి స్థానంలో ఉండగా.. 112 పాయింట్లతో ఆసీస్  రెండో స్థానంలో ఉంది.  న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు 111 పాయింట్లతో 3, 4వ స్థానాల్లో ఉన్నాయి. 

click me!

Recommended Stories