మహిళా క్రికెటర్‌ని పెళ్లాడబోతున్న రుతురాజ్ గైక్వాడ్... ఎవరీ ఉత్కర్ష పవార్...

First Published May 31, 2023, 4:27 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, 2023 సీజన్‌లోనూ 590 పరుగులు చేసి ఓపెనర్ డివాన్ కాన్వేతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 26 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్, పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు...

Image credit: PTI

మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్, నాలుగు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో కీ ప్లేయర్‌గా మారాడు. టీమిండియా తరుపున 9 టీ20 మ్యాచులు, ఓ వన్డే ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశించినన్ని అవకాశాలైతే అందుకోలేదు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023కి ఎంపిక చేసిన భారత జట్టులో స్టాండ్ బై ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కి చోటు దక్కింది. అయితే వ్యక్తిగత కారణాతో ఈ టూర్‌కి దూరంగా ఉన్నాడు రుతురాజ్ గైక్వాడ్...

జూన్ 2-3 తేదీల్లో రుతురాజ్ గైక్వాడ్ విహహం ఉత్కర్ష పవార్‌తో జరగనుంది. తన గర్ల్ ఫ్రెండ్ ఉత్కర్ష పవార్‌తో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలు దిగిన రుతురాజ్ గైక్వాడ్, మాహీతో దిగిన ఫోటోలను షేర్ చేసి... ‘నా జీవితంలో ఇద్దరు వీవీఐపీలు...’ అంటూ కాప్షన్ జోడించాడు..

పూణేకి చెందిన ఉత్కర్ష పవార్, మహారాష్ట్ర తరుపున దేశవాళీ టోర్నీలు ఆడుతుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఉత్కర్ష, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది...
 

అక్టోబర్ 13, 1998లో పుట్టిన ఉత్కర్ష పవార్, 11 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతోంది. పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైనెన్స్‌లో చదువుకుంటోంది...
 

2021 అక్టోబర్ 15న రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తే, ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకు 2021, నవంబర్ 15న ఉత్కర్ష పవార్... ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆఖరి మ్యాచ్ ఆడింది..

click me!