విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు, ఆ ముగ్గురికీ అందకుండా ఊరిస్తున్న సెంచరీ... రోహిత్ శర్మతో పాటు...

Published : Jul 18, 2022, 01:53 PM IST

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ జరుగుతోంది. ఆఖరి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దగ్గర్నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వరకూ అందరూ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కామెంట్లు చేస్తున్నారు... అయితే విరాట్ కోహ్లీ మాత్రమే కాదు టీమిండియాలో మరో ముగ్గురు ప్లేయర్లు సెంచరీ మార్కు అందుకోవడానికా ఆపసోపాలు పడుతున్నారు...

PREV
18
విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు, ఆ ముగ్గురికీ అందకుండా ఊరిస్తున్న సెంచరీ... రోహిత్ శర్మతో పాటు...
Virat Kohli

2019 నవంబర్‌లో వెస్టిండీస్‌పై చివరిగా అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు. అయితే ఈ కాలంలో డజనుగా పైగా హాఫ్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ...

28
Cheteshwar Pujara

విరాట్ కోహ్లీ 2019 నవంబర్‌లో సెంచరీ సాధిస్తే, భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా జనవరి 2019లో చివరి సెంచరీ సాధించాడు. 2019 జనవరి 3న సిడ్నీలో సెంచరీ చేసిన పూజారా, మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు...

38

పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా, రంజీ ట్రోఫీ 2022లో రెండు, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు సెంచరీలు చేసి తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఐదో టెస్టులోనూ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు ఛతేశ్వర్ పూజారా...

48

భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి టెస్టుల్లో ఏడు, వన్డేల్లో 17 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో హాఫ్ సెంచరీల కంటే సెంచరీలు ఎక్కువ చేసిన ప్లేయర్లలో శిఖర్ ధావన్ ఒకడు. అయితే పేలవ ఫామ్ కారణంగా టెస్టుల్లో చోటు కోల్పోయాడు ధావన్...
 

58

వన్డేల్లో కీలక సభ్యుడిగా రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్న శిఖర్ ధావన్, చివరిగా 2019 జూన్ 9న ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. ఆ తర్వాత మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు శిఖర్ ధావన్...

68

విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ కూడా వైట్ బాల్ క్రికెట్‌లో సెంచరీ చేసి రెండేళ్లు దాటిపోయింది. టెస్టుల్లో 2021 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌పై, సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌లో మొట్టమొదటి విదేశీ సెంచరీ చేసిన రోహిత్ శర్మ... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ మార్కు అందుకోలేకపోతున్నాడు...

78

టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసి టాప్‌లో నిలిచిన రోహిత్ శర్మ, ఈ ఏడాది ఇప్పటిదాకా పొట్టి ఫార్మాట్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2020 జనవరిలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన రోహిత్ శర్మ, రెండున్నరేళ్లుగా వన్డేల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు.

88

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో వరుసగా ఐదు సెంచరీలు బాది సరికొత్త రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ, రికీ పాంటింగ్ 30 వన్డే సెంచరీల రికార్డుకి అడుగు దూరంలో నిలిచాడు..

Read more Photos on
click me!

Recommended Stories