Published : Jul 18, 2022, 12:59 PM ISTUpdated : Jul 18, 2022, 02:11 PM IST
కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్‌లో రిషబ్ పంత్ ఫామ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. టెస్టుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నా వైట్ బాల్ క్రికెట్‌లో రిషబ్ పంత్ పదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో పంత్ విశ్వరూపమే చూపించాడు...
260 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది భారత జట్టు. రెండో వన్డేలో జరిగినట్టే టాపార్డర్ ఢమాల్ కావడంతో వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా చిత్తుగా ఓడుతుందని అనుకున్నారంతా...
28
Rishabh Pant
అయితే నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఐదో వికెట్‌కి 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కి అజేయంగా 56 పరుగుల భాగస్వామ్యం జోడించాడు...
38
113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసిన రిషబ్ పంత్, సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత డేవిడ్ విల్లే వేసిన 42వ ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్లకు విశ్వరూపం చూపించాడు...
48
31 టెస్టుల్లో 5 సెంచరీలు చేసిన రిషబ్ పంత్‌కి వైట్ బాల్ క్రికెట్‌లో ఇదే మొట్టమొదటి సెంచరీ. ఇంగ్లాండ్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్...
58
‘ఈ ఇన్నింగ్స్ నా జీవితాంతం గుర్తుంచుకుంటా. ఎందుకంటే ఇది వన్డే ఫార్మాట్‌లో నా మొదటి సెంచరీ, అదీ కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తే... ఆ కిక్ వేరేగా ఉంటది...
నేను సెంచరీ చేయాలని, భారీ ఇన్నింగ్స్ ఆడాలని కానీ అనుకోలేదు. బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఫేస్ చేయబోయే బాల్‌ని ఎలా ఆడాలని మాత్రమే ఆలోచిస్తాను....
68
ఇంగ్లాండ్‌లో ఆడడం ఎప్పుడూ భలే మజాగా ఉంటుంది. ఎక్కువ మ్యాచులు ఆడే కొద్దీ అనుభవం పెరుగుతూ ఉంటుంది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోంది...
78
Image credit: PTI
ఇలాంటి పిచ్‌పై వారిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాం అంటే దానికి బౌలర్లే కారణం. ఈ మ్యాచ్‌లోనే కాదు, సిరీస్ మొత్తంలో వాళ్లు బ్రిలియెంట్‌గా బౌలింగ్ చేశారు..’ అంటూ కామెంట్ చేశాడు రిషబ్ పంత్...
88
మూడు వన్డేల సిరీస్‌లో ఏ వన్డే కూడా పూర్తిగా 100 ఓవర్ల పాటు సాగలేదు. అంతేకాదు మూడు వన్డేల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఏ టీమ్ కూడా పూర్తిగా 50 ఓవర్ల పాటు ఆడి ఇన్నింగ్స్ పూర్తి చేసింది లేదు...