టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టులో వచ్చి, స్టార్ ప్లేయర్‌గా మారాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. కెరీర్ ఆరంభంలో వరుసగా విఫలమవుతున్నా అనేక అవకాశాలు ఇచ్చి రిషబ్ పంత్‌ని సపోర్ట్ చేశాడు రవిశాస్త్రి...
ఐపీఎల్ 2020 తర్వాత భారత జట్టులో మూడు ఫార్మాట్లలోనూ స్థిరమైన చోటు దక్కించుకున్న రిషబ్ పంత్, బ్రిస్బేన్ టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్ ఆడి... స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు...
27
తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు అట్టర్‌ఫ్లాప్ అయిన చోట... సెంచరీతో చెలరేగి భారత జట్టుకి అద్భుత విజయం అందించాడు రిషబ్ పంత్...
37
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శిఖర్ ధావన్ 1, రోహిత్ శర్మ 17, విరాట్ కోహ్లీ 17, సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు చేసి అవుట్ కావడంతో 72 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
47
ఈ పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కి 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్, 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్‌ని ముగించాడు...
57
Image credit: PTI
ఈ ఇన్నింగ్స్ కారణంగా రిషబ్ పంత్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. అవార్డు కింద ట్రోఫీ, నగదు బహుమతితో పాటు షాంపైన్ బాటిల్‌ని కూడా బహుకరించారు నిర్వాహకులు...
67
ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిని క్రీజులో చూసిన రిషబ్ పంత్, తనకి ఇచ్చిన షాంపైన్ బాటిల్‌ని తీసుకొచ్చి, అతనికి గురుదక్షిణగా సమర్పించాడు...
77
అలాగే వన్డే సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో మరో షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగిలిన ప్లేయర్లను తడిపి వేశాడు రిషబ్ పంత్...