‘మానవత్వం ఉన్న మనిషిగా ట్వీట్ చేశా...’ కంగనా రనౌత్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్...

First Published May 14, 2021, 11:57 AM IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటున్నాడు భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. కరోనా బాధితుల కోసం తనవంతు సాయం చేస్తున్న ఇర్ఫాన్ పఠాన్, తాజాగా ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందించాడు.  

‘మీలో ఏ మాత్రం మానవత్వం మిగిలి ఉన్నా పాలస్తీనాలో జరుగుతున్నదాన్ని సపోర్ట్ చేయరు.... మానవత్వాన్ని కాపాడండి...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్. దీనికి కొందరు నెటిజన్ల నుంచి ట్రోలింగ్ వచ్చింది....
undefined
‘ఇతర దేశాలపై ఇర్ఫాన్ పఠాన్‌కి ఉన్న ప్రేమ, సొంత దేశంపై ఎందుకు లేదు. బెంగాల్‌తో జరిగిన హింసపై ఇర్ఫాన్ పఠాన్ ఎందుకు స్పందించలేకపోయాడు...’ అంటూ కామెంట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్...
undefined
దీనికి స్పందనగా ‘మానవత్వానికి ఒకే ఒక్క దేశం ఉంది. దాని పేరు విశ్వం...’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ‘నా ట్వీట్లు అన్నీ మానవత్వం కోసం లేదా దేశ ప్రజల కోసం.. నా దృష్టిల్లో దేశానికి నేతృత్వం వహించే ప్రతీ ఒక్కరూ హైయ్యర్ లెవెల్‌లో ఉన్నట్టే...
undefined
అయితే కొందరు కావాలని విషయాలను వివాదాస్పదం చేయాలనుకునే కంగనా లాంటివాళ్లు, ‘హేట్’ను స్ప్రెడ్ చేస్తున్నారని నిషేధించబడినవాళ్లు, మరియు ఇంకొందరు కేవలం విమర్శించడానికి డబ్బులు తీసుకునేవాళ్లు’ అంటూ రాసుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్...
undefined
కరోనాతో బాధపడుతున్న వారి కుటుంబాల కోసం తనవంతు సాయంగా రేషన్ సరుకులను విరాళంగా ఇస్తున్నారు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్. ఇప్పటికే పఠాన్ బ్రదర్స్, 90 వేల కుటుంబాల ఆకలిని తీర్చారు...
undefined
బాలీవుడ్ హీరోయిన్, వివాదాస్పద నటి కంగనా రనౌత్ మాత్రం ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్, ఇజ్రాయిల్‌కి మద్ధతుగా ఉంటుందని పోస్టులు చేస్తూ వస్తోంది.
undefined
టెర్రరిజాన్ని ప్రోత్సాహించే ముస్లిం మతానికి స్థావరమైనపాలస్తీనాపై యుద్ధానికి భారత్ నుంచి మద్ధతు ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్టులు చేస్తోంది కంగనా రనౌత్. ట్విట్టర్ కంగనా అకౌంట్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
undefined
click me!